సాధారణంగా పాములు పగబడతాయనీ, ఎద్దులు, ఏనుగులు కోపం వస్తే కంట్రోల్ తప్పుతాయని తెలుసు కానీ, ఇక్కడ విచిత్రంగా కోతి మతి తప్పింది. అచ్చం మందు తాగిన కోతిలా రెచ్చిపోయింది. కేవలం రెండేళ్ల చిన్నారిని టార్గెట్ చేసి తీవ్రంగా గాయపరిచింది. చివరికి తల్లిదండ్రులు వచ్చి విడిపించుకుపోయినా వదలకుండా వెంటబడిన ఈ ఘటన రష్యాలో జరిగింది. ఈ వీడియోను, వివరాలను ఇంగ్లండుకు చెందిన మెట్రో వార్తా సంస్థ తెలిపింది. టెర్పిగోరివో ప్రాంతంలో నివసించే స్నేహితుడి ఇంటికి ఓ కుటుంబం వచ్చింది.
ఈ క్రమంలో పార్కులో పిల్లలు ఆడుకుంటుండగా, ఓ కోతి వచ్చి పిల్లలపై దాడి చేసింది. దాంతో భయపడి మిగతా పిల్లలు పారిపోగా, రెండేళ్ల చిన్నారి పౌలీనా మాత్రం కోతికి దొరికిపోయింది. కోతి చిన్నారిని ఎత్తుకెళ్లే ప్రయత్నం చేయడంతో చిన్నారి కేకలు వేసింది. దాంతో అప్రమత్తమైన చిన్నారి తల్లిదండ్రులు పరిగెత్తుకుంటూ వచ్చి చిన్నారిని కాపాడే ప్రయత్నం చేశారు. అయినా వదలని కోతి వారిపై కూడా దాడికి దిగింది. తండ్రి కాలితో తంతూ కోతిని చెదరగొట్టే ప్రయత్నం చేస్తూ ఎంత ప్రతిఘటించినా చిన్నారిని లాగేసుకునే ప్రయత్నం మానలేదు. దాంతో ఎలాగోలా కోతి బారి నుంచి చిన్నారిని రక్షించిన పేరెంట్స్.. తీవ్రంగా గాయపడిన పౌలీనాను ఆస్పత్రిలో చేర్పించారు. చేతులు, కాళ్లపై గాయాల కారణంగా తీవ్రంగా రక్తం పోయిందని వైద్యులు తెలిపారు. అయితే కోతి ఎలా వచ్చిందనే ఆసక్తితో చుట్టుపక్కల ప్రాంతాలు పరిశీలించగా, ఆశ్చర్యకర విషయం వెలుగులోకి వచ్చింది. వారి ఇంటి పక్కనే ఓ ధనవంతుడు ప్రైవేటు జూను నిర్వహిస్తున్నాడంట. అందులో పులి, జింకలు, ఏనుగులు, కోతులు వంటి జంతువులు ఉన్నాయంట. కోతి ఆ జూ నుంచి తప్పించుకొని వచ్చి దాడి చేసిందని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.
قرد يهاجم فتاة صغيرة ويحاول اختطافها من والدتها..
🛑 ملاحظة : غريبة التغيير في فطرة الحيوانات .. pic.twitter.com/2UafWTdM1j
— #كابتن_غازي_عبداللطيف (@CaptainGhazi) July 22, 2022