A monkey came out of the zoo and made a comedy in ukraine
mictv telugu

ఉక్రెయిన్ యుద్ధం నడుమ కోతి కామెడీ.. వైరల్ వీడియో

September 9, 2022

రష్యాతో యుద్దం వలన బాంబుల మోతతో నిత్యం దద్ధరిల్లుతున్న ఉక్రెయిన్‌లో ఓ కోతి చేసిన వింత చేష్టలు అక్కడి పౌరులకు కామెడీని పంచింది. జూలో ఉండాల్సిన కోతి బయటికి వచ్చిన వేసిన వేషాలను వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎంటర్‌టైన్ అవుతున్నారు. ఖార్కీవ్‌లోని జూలో ఉండే ఈ కోతి పేరు చీచీ. అయితే అక్కడ రష్యా ఓసారి బాంబు వేయడంతో పేలుళ్ల శబ్దానికి భయపడిపోయింది. దీంతో జూ నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని పలుమార్లు ప్రయత్నించగా, సాధ్యం కాలేదు. అయితే ఎట్టకేలకు చాకచక్యంగా తప్పించుకొని జనారణ్యంలోకి ప్రవేశించింది. నగరం చుట్టూ తిరుగుతూ తెగ ఎంజాయ్ చేసింది. తన చేష్టలతో పౌరులకు ఆనందాన్ని పంచింది. చీచీని తిరిగి తీసుకురావాలన్న జూ అధికారుల ప్రయత్నాలు అన్నీ విఫలమయ్యాయి. అయితే బయటి ప్రపంచంలో ఎక్కువ రోజులు మనుగడ సాధించడం కష్టమనుకుందేమో. తిరిగి జూకి వచ్చేందుకు సిద్ధపడింది. వీధుల్లో తిరుగుతున్న చీచీకి ఒకావిడ జాకెట్ తొడగగా, తర్వాత చీచీ మహిళను హగ్ చేసుకుంది. తర్వాత చీచీని వారు ఓ సైకిల్ మీద కూర్చోబెట్టి జూకు తరలించగా, బుద్ధిగా వెళ్లిపోయింది. దీంతో జూ సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు.