A monkey drinking beer
mictv telugu

కోతి బీరు ఎలా తాగుతుందో చూడండి..

November 1, 2022

Attack On Etela car,palivela,BJP vs TRS,EC Serious,Telangana,Police

మాకేం ఏం తక్కువ, మేము మందు వేస్తాం, చిందేస్తాం అంటున్నాయి యూపీ రాయబరేలిలో కోతులు..అవును మీరు చదివింది నిజమే అక్కడ కోతులు మందుబాబులతో పోటీగా మద్యం దుకాణాలకు వెళ్తున్నాయి. బీర్, విస్కీ, రమ్ము ఏదైన ఓకే అంటూ తాగేస్తున్నాయి..

గడగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అచల్‌గంజ్ ప్రాంతంలోని ఓ దుకాణం వద్ద కోతుల హడావుడి మాములుగా లేదు.. మద్యం దుకాణంపై పడి.. అందులో మందు కొడుతూ ఎంజాయ్ చేస్తున్నాయి. కస్టమర్స్ చేతిలో నుంచి లాక్కోని ఎత్తిన బీరు దించకుండా తాగేస్తున్నాయి. దీంతో మందబాబులు, మద్యం దుకాణాదారులు తలపట్టుకుంటున్నారు.

తాజాగా కోతి మద్యం తాగుతున్న ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతుంది.. ఆ వీడియోలో కోతి చాలా ఉత్సాహంగా బీర్ తాగుతూ కనిపించింది. అనంతరం “అసలే కోతి ఆపై కల్లు తాగిందనే సామెతను గుర్తు చేస్తూ” నానా హంగామా సృష్టించింది. కోతుల బెడదనుంచి తమను కాపాడాలంటూ స్థానికులు అధికారులను కోరడంతో సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని జిల్లా ఎక్సైజ్ అధికారి రాజేంద్ర ప్రతాప్ సింగ్ చెప్పారు