A monkey kissed his friend's dead body in srilanka
mictv telugu

అన్నం పెట్టిన వ్యక్తి చనిపోయాడని ఈ కోతి ఏం చేసిందో చూడండి

October 20, 2022

A monkey kissed his friend's dead body in srilanka

తనకున్న ప్రాథమిక లక్షణాలను మర్చిపోతున్న మనిషికి బుద్ది చెప్పే సంఘటనలు ప్రకృతిలో కోకొల్లలుగా ఉన్నాయి. కానీ, వాటిని చూసి కూడా మనిషి తన బుద్ధిని మార్చుకోవడానికి సిద్ధపడడు. తిన్నింటి వాసాలు లెక్కపెట్టే వ్యక్తులు సమాజం నిండా ఉన్నారు.

ఇలాంటి వారికి గుణపాఠం చెప్పేలా ఓ కోతి చేసిన పని సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. శ్రీలంకలోని బట్టికలోవ జిల్లాలో జరిగింది ఈ సంఘటన. జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి వానరంతో స్నేహం చేసి రోజూ అన్నం పెట్టేవాడు. అలా స్నేహం పెరిగి సరదాగా ఆడుకునేవారు. అయితే ఈ నెల 18న ఆ వ్యక్తి చనిపోవడంతో వానరానికి అన్నం పెట్టడానికి రాలేదు. దీంతో దిగాలుపడిన కోతి కంట ఆ వ్యక్తి పార్థీవ దేహం కనపడింది. వెంటనే మృతదేహం వద్దకు వెళ్లి చనిపోయాడని తెలియక తట్టిలేపే ప్రయత్నం చేసింది. ఎంతకూ లేవకపోవడంతో చనిపోయాడని గ్రహించి నుదుటిపై ముద్దుపెట్టి నివాళులర్పించింది.