రెచ్చగొట్టిన యువతికి కొండముచ్చు గుణపాఠం.. వీడియో చూడండి - MicTv.in - Telugu News
mictv telugu

రెచ్చగొట్టిన యువతికి కొండముచ్చు గుణపాఠం.. వీడియో చూడండి

July 25, 2022

సాధారణంగా మనం జూకు వెళ్తే కొన్ని జంతువులను దూరం నుంచి చూడాలని చెప్తుంటారు. ఎందుకంటే వాటికి మనం అందేంత అందుబాటులో ఉంటే మనకే ప్రమాదమని ముందుగానే హెచ్చరిస్తారు. అయినా కొంతమంది అత్యుత్సాహంతో వాటి దగ్గరకెళ్లి అతి చేస్తారు. దీంతో జంతువులు రెచ్చిపోయి వారిపై దాడి చేస్తాయి. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జూకు వెళ్లిన ఓ యువతి కొంముచ్చు ఉన్న బోను దగ్గరికెళ్లి వాటిని కవ్విస్తుంది. దాంతో రెచ్చిపోయిన కొండముచ్చు బోను నుంచి చేతిని బయటికి తీసి యువతి జుట్టు పట్టుకుంటుంది. విడిపించుకోవడానికి యువతి ఎంత ప్రయత్నించినా కొండముచ్చు వదలకుండా రెండు చేతులతో జుట్టును మరింత గట్టిగా పట్టుకొని లాగుతుంది. దీంతో అప్రమత్తమైన పక్కవాళ్లు వచ్చి భయపెట్టడంతో కొండముచ్చు జుట్టును వదిలేస్తుంది. తర్వాత కొన్ని సెకండ్లకే యువతి బోను పక్కనుంచి వెళ్లిపోతుండగా, కొండముచ్చు తిరిగి జుట్టును పట్టుకుంటుంది. చివరికి ఎలాగోలా యువతి తప్పించుకొని వెళ్లిపోతుంది. విదేశాల్లో జరిగిన ఈ ఘటనపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.