a monkey washing clothes like a men
mictv telugu

బట్టలు ఉతికారేస్తున్న కోతి..

November 8, 2022

అతి అల్లరి చేసే జంతువు ఏదంటే టక్కున గుర్తుకొచ్చేది కోతి. దాని అల్లరి మామూలుగా ఉండదు. కోతి పనులు కొనిసార్లు చిరాకు తెప్పిస్తే..మరికొన్ని సార్లు నవ్వు తెప్పిస్తాయి.కొన్ని పనులు ఆశ్చర్యానికి కూడా గురిచేస్తాయి. ఇటీవల సోషల్ మీడియాలో కోతి చేష్టలు వైరల్ అవ్వడం మనం చూస్తుంటాం..తాజాగా మరో అలాంటి వీడియోనే చక్కెర్లు కొడుతోంది. అచ్చం మనిషిలానే కోతి బట్టలు ఉతుకున్న వీడియోని చూసి నెటిజన్లు మురిసిపోతున్నారు.

వీడియోలో కనిపిస్తున్న కోతి.. మనిషి చేసినట్లుగానే పనులు చేస్తోంది. ఇంట్లో ఎన్ని మాసిపోయిన బట్టలు ఉన్న తెచ్చేయండి.. ఉతికి ఆరేస్తా అంటుంది. మనం ఎలా ఐతే బట్టలకి సబ్బు రాసి ఆ తర్వాత ఉతుకుతూ ఉంటామో అలానే ఉతుకుంది. బ్రష్ కూడా పెట్టి పామేస్తుంది. నీటిలో కూర్చోని బట్టలను బండకేసి బాదేస్తోంది. ఈ వీడియోని చూసిన వారందరూ మనకంటే కోతే బాగా ఉతుకుతుందని కామెంట్స్ చేస్తున్నారు.

https://www.instagram.com/ankit_ang_11/?utm_source=ig_embed&ig_rid=976932ca-b042-4ecb-9f5e-79582be88a58