వీడియో : గుర్రంపై ఫుడ్ డెలివరీ.. షాకింగ్ రీజన్ చెప్పిన స్విగ్గీ బాయ్ - MicTv.in - Telugu News
mictv telugu

వీడియో : గుర్రంపై ఫుడ్ డెలివరీ.. షాకింగ్ రీజన్ చెప్పిన స్విగ్గీ బాయ్

July 4, 2022

ఈ ఆధునిక కాలంలో స్విగ్గీ, జొమాటోలు వచ్చిన తర్వాత ప్రజలు బయటి ఫుడ్ తినడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఆర్డర్ పెట్టిన కొద్దిసేపటికే ఇష్టమైన ఫుడ్ డెలివరీ అవుతుండడంతో కస్టమర్ల ఆదరణతో ఈ వ్యాపారం కంపెనీలకు బాగా కలిసొస్తోంది. ఈ డెలివరీలో బాయ్స్ చాలా కీలక పాత్ర పోషిస్తారు. బైక్‌పై డెలివరీ చేసే బాయ్స్ మాత్రమే మనకు ఇప్పటివరకు కనిపించారు. కానీ, ముంబైలో ఓ బాయ్ మాత్రం డెలివరీకి గుర్రాన్ని వాడుతున్నాడు. వీధుల్లో అతను వీపున బ్యాగ్ వేసుకొని గుర్రంపై డెలివరీ చేస్తున్న క్రమాన్ని వెనుక నుంచి ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. దీంతో అందరూ అతని తెలివిని ప్రశంసిస్తున్నారు. అయితే బైకులు ఉండగా, గుర్రంపై ఎందుకు డెలివరీ చేస్తున్నావని అడిగితే ఆ యువకుడు షాకింగ్ విషయం చెప్పాడు. ‘ఈ వానాకాలంలో ముంబైలో బైకు మీద డెలివరీ ఇవ్వాలంటే చాలా టైం పడుతుంది. వర్షాలు పడి ఎక్కువ ట్రాఫిక్ జామ్ అవ్వడం, నీరు రోడ్లపై నిలిచిపోయి రవాణాకు ఇబ్బంది అవుతుందనే కారణంతో గుర్రంపై డెలివరీ ఇస్తున్నాను. దీని ద్వారా ట్రాఫిక్, బురదనీరు వంటి అడ్డంకులు ఉండవు. తద్వారా కస్టమర్లకు సకాలంలో డెలివరీ ఇవ్వగలుగుతాం. పైగా పెట్రోల్ ఖర్చు లేదు కాబట్టి ఆ మేర డబ్బు ఆదా చేసినట్టేగా’ అంటూ వివరణ ఇచ్చాడు ఆ కుర్రాడు.