A Muslim employer who flew 15 laborers to Tirupati
mictv telugu

TS కూలీలను విమానంలో తిరుమల తీసుకెళ్లిన ముస్లిం యజమాని.. కారణం ఇదీ

October 1, 2022

సాధారణంగా పండుగ సందర్భాల్లో లేకపోతే, ఇంట్లో శుభకార్యాలు జరిగితే యజమానులు వారి దగ్గర పనిచేసే వారికి కొంత డబ్బివ్వడమో, బట్టలు పెట్టడమో చేస్తారు. కానీ, అదిలాబాద్‌కు చెందిన ఓ యజమాని తన వద్ద పనిచేసే 15 మంది కూలీలను తిరుమల తీసుకెళ్లి వెంకన్న దర్శనం చేయించారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ యజమాని ముస్లిం మతస్థుడు కావడం. జిల్లాలోని ఇంద్రవెల్లిలో సాధారణ కిరాణా దుకాణం నడిపే అజీజ్ హిరాణీ వద్ద 15 మంది ఆదివాసీ హిందూ వర్గానికి చెందిన కూలీలు పనిచేస్తున్నారు. అయితే హిరాణీ కుమార్తె అప్రాణి ఆస్ట్రేలియాలో పైలెట్‌గా ట్రైనింగ్ పూర్తి చేసింది. త్వరలో పైలెట్‌గా విధుల్లో చేరనుంది. కన్న కూతురి కల నెరవేరిన ఆనందంలో హిరాణీ తన సంతోషాన్ని కూలీలతో పంచుకున్నారు. అంతేకాక, వారిని సొంత ఖర్చులతో హైద్రాబాద్ నుంచి తిరుపతికి విమానంలో తీసుకెళ్లి దర్శనం చేయించారు. తర్వాత పలు రిసార్టులకు తిప్పారు. దీంతో కూలీలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ యజమాని మంచి మనసుకు ధన్యవాదాలు తెలుపుతున్నారు.