చిత్తూరు : ఎదురింటికి వెళ్లొద్దన్నందుకు టెకీని చావగొట్టారు - MicTv.in - Telugu News
mictv telugu

చిత్తూరు : ఎదురింటికి వెళ్లొద్దన్నందుకు టెకీని చావగొట్టారు

May 10, 2022

వర్క్ ఫ్రం హోం చేస్తున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఎదురింటి ముస్లిం కుటుంబం చావగొట్టిన సంఘటన చిత్తూరు జిల్లా పలమనేరులో జరిగింది. వివరాలు.. బెంగళూరు ఐటీ కంపెనీలో పనిచేసే నిరంజన్.. కరోనా నుంచి ఇంటి నుంచే ఉద్యోగం చేస్తున్నాడు. లాక్ డౌన్ సమయంలో ఎదురింట్లో ఉండే ముస్లిం కుటుంబంతో చిన్న వివాదం జరిగింది. అప్పటినుంచి తరచూ గొడవలు జరిగేవి. దాంతో కాలనీవాసులు ఇరు కుటుంబాలను పంచాయితీ పెట్టి సర్ధిచెప్పారు. అయితే ఇటీవల నిరంజన్ ఇంట్లో ఓ మహిళ అద్దెకు దిగింది.

ఆ మహిళ ముస్లిం కుటుంబంతో సన్నిహితంగా ఉంటుండడంతో నిరంజన్ ఆమెను వాళ్లింటికి వెళ్లొద్దని వారించాడు. ఈ విషయాన్ని మహిళ ముస్లిం కుటుంబానికి చెప్పడంతో వారు ఆగ్రహానికి గురయ్యారు. సుమారు పది మంది నిరంజన్‌పై దాడికి దిగారు. మొదట సీసీ కెమెరాలను ధ్వంసం చేసి ఆ తర్వాత సుత్తితో నిరంజన్ శరీర భాగాలపై కొట్టారు. కంట్లో రక్తం వచ్చేలా తీవ్రంగా కొట్టారు. తమ ఇంటి పక్కన నివాసం ఉండొద్దని వార్నింగ్ ఇచ్చారు. దీంతో నిరంజన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు ఎలాంటి యాక్షన్ తీసుకోకపోవడంతో పోలీసులను నిరంజన్ నిలదీశాడు. తనకు, తన కుటుంబానికి ముస్లిం కుటుంబం నుంచి ప్రాణహాని ఉందని, దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని నిరంజన్ కోరుతున్నాడు.