A new style in business..how loudly he shouts..
mictv telugu

వ్యాపారంలో కొత్త స్టైల్..ఎంత గట్టిగా అరుస్తున్నాడో..

July 4, 2022

ప్రస్తుతం సమాజంలో రోడ్డుపై ఏ చిన్న వ్యాపారం చేయాలన్నా, ఆ వ్యక్తికి ఆ వ్యాపారంపై లోతైన అవగాహన, చక్కటి నైపుణ్యత ఉండాలి. దానితోపాటు కస్టమర్లను ఆకట్టుకునేలా కొత్త కొత్త ఐడియాలు ఉండాలి. అప్పుడే ఆ వ్యాపారం వృద్దిలోకి వస్తుంది. అంతేకాదు వందలకొద్ది కస్టమర్లు షాప్‌కు రావడమేగాక, పది మందికి ఆ సమాచారాన్ని అందజేస్తారు. దాంతో ఆ వ్యాపారం ఆ నోట ఈ నోట పడి వేల మందికి చేరుతుంది.

https://telugu.oneindia.com/news/india/passionate-fruit-seller-video-goes-viral-in-social-media/articlecontent-pf384566-321278.html

అయితే, ఓ పండ్ల వ్యాపారి తన వ్యాపారం అభివృద్దిలోకి రావడానికి, వందల కొద్ది కస్టమర్లు తన షాపు వద్దకు రప్పించడానికి ఓ కొత్త విధానాన్ని కనుక్కున్నాడు. పండ్లను కొత్త కొత్త స్టైల్‌లో కట్ చేస్తూ, గట్టి గట్టిగా అరుస్తూ, తన హావభావాలతో కస్టమర్లను ఆకట్టుకుంటున్నాడు. తన బండి వద్దకు వచ్చిన ప్రతి కస్టమర్ అతడు పండ్లను కట్ చేస్తున్న విధానానికి ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఆ వ్యాపారికి సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

మరి ఆ వీడియోలో ఏముందో తెలుసుకుందామా.. ‘రోడ్డుపై ఓ పండ్ల వ్యాపారి ఉన్నాడు. తన బండిపై వాటర్ మిలన్, పాపాయి పండ్లు ఉన్నాయి. అయితే, వాటిని విక్రయించేందుకు అతడు కొత్త టెక్నాలజీని ఉపయోగిస్తున్నాడు. పండ్లను అందంగా కత్తిరించి చూపిస్తున్నాడు. అంతేకాదు పండ్లను కత్తిరించిన ప్రతిసారి గట్టి గట్టిటా అరుస్తూ, రండి బాబు రండి అంటూ స్వాగతం పలుకుతున్నాడు. ఆ సమయంలో అతని హవభావాలను చూస్తున్న ప్రతివారు తెగ నవ్వుకుంటున్నారు. బండి వద్ద కుప్పలుగా జనం ఎగబడి అతడు చేసే విన్యాసాలను తిలికిస్తున్నారు.”

ఇప్పటివరకూ ఆ వీడియోను 65 వేల మంది లైక్ చేశారు. కొందరు వీడియోపై స్పందిస్తూ.. ‘గట్టి గట్టిగా అరుస్తూ, ఎంజాయ్ చేస్తూ,వ్యాపారం చక్కగా చేస్తున్నాడు’ అని, ‘క్రోగర్ కంపెనీ ప్రచారం కోసం చూస్తుంది. దానికి ఇతను బాగా సరిపోతడు’ అని కామెంట్స్ మీద కామెంట్స్ చేస్తున్నారు.