a new technology invented in road repaires. Roads
mictv telugu

గుంతలను పూడ్చే ప్యాచ్…

December 1, 2022

రోడ్లు వేయడం….దీనిలో మన భారత్ కన్నా అమెరికా వంటి దేశాలు ఎప్పుడూ ముందు ఉంటాయి. అక్కడ నాణ్యత కానీ, వాళ్ళు అనుసరించే పద్ధతుల్లో కాని ఎప్పుడూ భారత్ కన్నా చాలా రెట్లు మెరుగ్గా ఉంటారు. ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీని వాడుకుంటూ అద్భుతమైన రోడ్లను మెయిన్ టెయిన్ చేస్తుంటారు. ఇప్పడు కొత్తగా రోడ్ల ప్యాచ్ వర్క్ ను మొదలుపెట్టారు అమెరికా వాళ్ళు. అంటే ఇంతకు ముందులాగా కంకర, సిమెంట్, తారు లాంటి పదార్ధాలు ఉపయోగించకుండా రోడ్లు వేసేస్తారు అన్నమాట.

రోడ్లు వెయ్యడానికి ప్రత్యేకమైన షీట్లను తయారు చేస్తోంది అమెరికా. రోడ్డు వెయ్యడానికి వాడే మెటీరియల్ తో ముందుగానే షీట్లను తయారు చేసి ఉంచుకుంటారు. ఎక్కడ రోడ్డు మరమత్తు వచ్చిందో అక్కడకు ఆ షీట్ ను తీసుకెళ్ళి అతికించేస్తారు. అంతే కొత్త రోడ్ తయారు అయిపోతుంది. ప్రస్తుతం ఫుల్ లెంగ్త్ రోడ్లు వెయ్యడానికి దీన్ని ఇంకా ఉపయోగించడం లేదు కానీ…ఎక్కడైనా గుంతలు, రోడ్డు పాడయిన చోట్ల ఈ టెక్నిక్ ను ఉపయోగిస్తున్నారు. ఈ ప్యాచ్ ను అతికించిన తర్వాత దిమ్మిసతో కొడితే రమామూలు రోడ్డులా అయిపోతుంది. సెయింట్ గోబైన్ అనే సంస్థ దీన్ని తయారుచేసింది.

ఈ షీట్ పొరలు పొరలుగా ఉంటుంది. వీటిల్లో తారు, సింథటిక్, ఫైబర్ లను మిక్స్ చేస్తున్నారు. ఇవి నీటిని తట్టుకుని నిలబడతాయి. పెద్ద పెద్ద వర్షాలు పడినా పాడవ్వకుండా ఉంటాయిట. 69 చ.అడుగలతో ఒక్కో షీట్ ఉంటుందని చెబుతోంది పెయింట్ గోబైన్ సంస్థ. ఈ ప్యాచ్ 4 లేదా 5 ఏళ్ళ పాటూ ధృడంగా ఉంటుందని చెబుతోంది. అంతేకాదు రోడ్డు మరమ్మత్తు పని కూడా చాలా తొందరగా అయిపోతుందని చెబుతున్నారు. సుమారు 5 నిమిషాల్లోపునే అంతా పూర్తి అయిపోతుందని తెలిపారు.ఇద్దరు మనుషులు మోసుకువచ్చే బరువుతోనే ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది లేబర్ కూడా అవసరం పడదు అని చెబుతున్నారు.

ఈ రోడ్ ప్యాచ్ పెద్ద విస్లవం అనే అంటున్నారు ఇంజినీర్లు. అమెరికా, ఐరోపాల్లోనే కాదు మన దేశానికి కూడా ఈ ప్యాచ్లు బాగా ఉపయోగపడతాయని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు న్యాక్ జనరల్ డైరెక్టర్ భిక్షపతి. ట్రాఫిక్, వర్షపు నీరు ఎక్కువగా నిలిచిపోయి మన రోడ్లు చాలా తొందరగా పాడవుతాయని…ఇలాంటి ప్యాచ్ లు వస్తే ఆ మరమ్మత్తులు ఈజీగా అయిపోతాయని అంటున్నారు. రోజుల తరబడి రోడ్డు మరమ్మత్తులు చేసే శ్రమ తప్పుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. భారత్ కూడా ఈ రోడ్ ప్యాచ్ లను అడాప్ట్ చేసుకోవాలని సూచిస్తున్నారు.