ఎలుగుబంటి తిరుగుబాటు (వీడియో) - MicTv.in - Telugu News
mictv telugu

ఎలుగుబంటి తిరుగుబాటు (వీడియో)

October 25, 2019

సర్కస్‌లో అప్పుడప్పుడు జంతువులు అదుపు తప్పి ప్రవర్తిస్తుంటాయి. ఒక్కసారిగా ఒంట్లో ఏదో శక్తి పూనినట్టు తిక్క తిక్క చేస్తాయి. తనకి ట్రైనింగ్ ఇస్తున్న వ్యక్తిపై దాడి చేస్తాయి. క్రూర మృగాలతో సర్కస్ చేస్తేనే వారి పూట గడుస్తుంది. అయితే సర్కస్ ఫీట్లు చేస్తున్న క్రమంలో జంతువులు దాడిచేసి ట్రైనీలు ప్రాణాలు పోగొట్టుకున్న ఘటనలు అక్కడక్కడా జరుగుతున్నాయి. తాజాగా అలాంటి ఘటనే రష్యాలో చోటు చేసుకుంది. ఎలుగుబంటితో ట్రైనీ క్లోనెట్స్‌లో ఫీట్లు చేయిస్తున్నాడు. 

ఒకసారి అటు వెళ్లి.. తిరిగి వచ్చారు. ఇంతలో ఎలుగుకు తిక్కరేగింది. అంతే అతని రెక్క పట్టుకుంది. క్షణాల్లోనే కిందపారేసి రక్కసాగింది. పక్కనే ఉన్న వ్యక్తి దానిని రెండుసార్లు కాలితో తన్నాడు. చుట్టూ చూస్తున్న జనాలు భయంతో హాహాకారాలు చేయసాగారు. కొందరు దానిని గట్టిగా అదిలించారు. వారి అరుపులు విని ఎలుగు జడుసుకుని అతని రెక్క వదిలేసింది. దీంతో అతను బతికి బట్టకట్టాడు. వెంటనే అతన్ని సమీప ఆస్పత్రికి తీసుకువెళ్లి వైద్యం చేయించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.