A passenger carrying Saudi Arabian currency in a sweet box
mictv telugu

స్వీట్ బాక్స్ లేయర్‌లో అరకోటి అరేబియా డబ్బు.. వీడియో వైరల్

September 8, 2022

గల్ఫ్ దేశాల నుంచి మన దేశానికి సాధారణంగా బంగారం పెద్ద ఎత్తున స్మగుల్ అవుతుంది. దాని తర్వాత డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాలు ఉంటాయి. అయితే ఓ వ్యక్తి వీటికి భిన్నంగా అక్కడి కరెన్సీని అక్రమంగా రవాణా చేశాడు. దొరక్కుండా ఉండేందుకు అతను డబ్బును దాచిన పద్ధతి చూసి కస్టమ్స్ అధికారులకు మతిపోయింది. రూ. 54 లక్షల విలువ చేసే కరెన్సీని ఎలా దాచి తెచ్చాడనే వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. సౌదీ అరేబియా నుంచి ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ఓ ప్రయాణీకుడిపై అనుమానం వచ్చిన పోలీసులు అతడి లగేజీని చెక్ చేయగా స్వీట్ బాక్సులు కనిపించాయి. మొదట్లో అనుమానం అనుకోకపోయినా అంత దూరం నుంచి స్వీట్ బాక్సులు ఎందుకు తెచ్చి ఉంటాడనే కోణంలో వాటిని క్షుణ్ణంగా పరిశీలించగా, బాక్స్ చుట్టూ ఉండే లేయర్లలో ప్యాక్ చేసిన విషయం బయటపడింది. వాటిని విప్పి నోట్లను వెలికితీసిన అధికారులు.. అది సౌదీ అరేబియా కరెన్సీ అని, వాటి విలువ మన రూపాయల్లో 54 లక్షలుంటుందని తేల్చారు.