A pastor naga bhushanam digging a hole in a church
mictv telugu

చర్చిలో గొయ్యి.. దేవుడి పేరుతో పాస్టర్ వింత ప్రవర్తన

November 21, 2022

ఏపీలో ఓ పాస్టర్ వింతగా ప్రవర్తిస్తున్నాడు. తనను దేవుడు పిలుస్తున్నాడని చెప్తూ పది రోజులుగా కుటుంబ సభ్యులను ఆందోళనకు గురి చేస్తున్నాడు. పాస్టర్ ప్రవర్తనతో విసిగిపోయిన గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కృష్ణా జిల్లా గన్నవరం మండలం గొల్లనపల్లిలో నాగభూషణం అనే పాస్టర్‌కు సొంత చర్చి ఉంది. అయితే కొన్ని రోజులుగా దేవుడు తనతో మాట్లాడుతున్నాడు, పరలోకానికి పిలుస్తున్నాడని పదిరోజులుగా వింతగా ప్రవర్తిస్తున్నాడు. అంతటితో ఆగక గొయ్యి తీసి తనను అందులో పూడ్చి వేస్తే దేవుడిలా మూడు రోజులలో తిరిగి బతికి బయటికి వస్తానని చర్చిలోనే గొయ్యి తవ్వించడం ప్రారంభించాడు. దీంతో ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు, గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. వారు కేసు నమోదు చేసుకొని పాస్టర్ నాగభూషణంను విచారిస్తున్నారు.