వెరైటీ జాబ్.. కుక్కను తిప్పితే నెలకు 2 లక్షల జీతం! - MicTv.in - Telugu News
mictv telugu

వెరైటీ జాబ్.. కుక్కను తిప్పితే నెలకు 2 లక్షల జీతం!

October 26, 2020

A PAWSOME offer! London law firm posts job ad looking for a 'professional' dog walker - on a salary of £30,000 with a pension and free healthcare

ఉద్యోగాల్లో ఉద్యోగాలు వేరయా అన్నట్టు కొన్ని ఉద్యోగాలు చాలా చిత్రంగా ఉంటున్నాయి. కాఫీ, బిస్కెట్ రుచి చూడటానికి కొన్ని కంపెనీలు లక్షల్లో జీతాలు ఇచ్చి రిక్రూట్ చేసుకుంటున్నాయి. అలాంటివి విన్నప్పుడు చాలా చిత్రంగా అనిపిస్తున్నా జరుగుతున్న వాస్తవం అదే. తాజాగా లండన్‌లోని ‘జోసఫ్‌ హేజ్‌ ఆరోన్‌సన్‌’ న్యాయవాద సంస్థ ఓ చిత్రమైన ఉద్యోగాన్ని ప్రకటించింది. ‘మా సంస్థలోని ఓ సీనియర్‌ సభ్యుడి వద్ద ఓ పెంపుడు కుక్క ఉంది. ఆ కుక్కను ఉదయం, సాయంత్రాలు ప్రతిరోజు క్రమం తప్పకుండా రోడ్లపై వాకింగ్‌కు తీసుకెళ్లాలి. డాగ్‌‌వాకర్‌‌గా చేయాలని ఇంట్రస్టు ఉన్నవారు మమ్మల్ని సంప్రదించవచ్చు. ఈ ఉద్యోగానికి అక్షరాలా ఏడాదికి 30 వేల పౌండ్ల జీతం ఇస్తాం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే.. కుక్కలను ప్రేమించేవారే ఈ ఉద్యోగానికి అర్హులు అన్న విషయం మరిచిపోవద్దు. డాగ్‌ వాకర్‌ ఉద్యోగానికి ఆడ, మగ ఎవరైనా అర్హులే. అయితే అనుభవం చాలా ముఖ్యం’ అని ఆ ప్రకటన సారాంశం. ఏడాదికి 30 వేల పౌండ్లు అంటే మన భారత కరెన్సీలో దాదాపు రూ.29 లక్షలు అన్నమాట. అంటే నెలకు రెండు లక్షలపైనే జీతం. 

ఈ ఉద్యోగానికి సదరు సంస్థ మరో ఆఫర్ కూడా ప్రకటించింది. జీతం కాకుండా పింఛను, జీవిత బీమాలతో పాటు ప్రైవేటు ఆరోగ్య , డెంటల్‌ బీమా సదుపాయాలు కూడా ఉంటాయని తెలిపింది. ప్రతి సోమవారం ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటలవరకు పెంపుడు కుక్క బాగోగులు చూసుకోవాల్సి ఉంటుందని వెల్లడించింది. అంతేకాకుండా మరికొన్ని నిబంధనలు కూడా చెప్పింది. డాగ్‌ వాకర్‌ కూర్చున్న చోట, కూర్చోకుండా కుక్క వెంట లండన్‌ వీధులన్నీ తిరుగుతూనే ఉండాలని, ఇందుకు ఉద్యోగికి ఫిట్‌నెస్‌ కూడా అవసరమని షరతు విధించింది. ప్రతి శనివారం, ఆదివారం సెలవులు తీసుకోవచ్చని.. రోజూవారి పని వేళల్లో మాత్రం ఖచ్చితంగా పనిచేయాల్సిందేనని పేర్కొంది. ఈ ప్రకటనకు చాలామంది స్పందిస్తున్నారట. వేలల్లో దరఖాస్తులు వస్తున్నాయట. కాగా, కంపెనీ ఇంటర్వ్యూ ఉంటుందని చెప్పలేదు.