ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ఫేస్బుక్ తన యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ఒకే వ్యక్తి ఐదు వేర్వేరు ప్రొఫైల్స్ పెట్టుకోవడానికి అనుమతించనుంది. ఈ ఫీచర్ ప్రస్తుతం పరీక్షల దశలో ఉండగా, దీని వల్ల యూజర్లకు మంచి బెనిఫిట్ ఉండే అవకాశముందని సంస్థ అంచనా వేస్తుంది. ఉదాహరణకు ఇప్పటివరకు యూజర్లకు తమ పర్సనల్ ఖాతా మాత్రమే ఉంది. దానిని తమ వ్యాపార, ఉద్యోగ వర్గాలతో పంచుకోవడానికి ఇష్టపడకపోవచ్చు. ఇలాంటప్పుడు వేర్వేరు ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకొని కొనసాగించే అవకాశం కలుగనుంది. కాకపోతే ఒక్కో ఖాతాకు ఒక్కో ఐడీని ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని ఆ సంస్థ ప్రతినిధి లియోనార్డ్ ధృవీకరించారు. ‘ప్రజలు తమ ఆసక్తులు, సంబంధాలకు అనుగుణంగా వివిధ గ్రూపులకు వేర్వేరు ప్రొఫైల్ కలిగి ఉండే ఫీచర్‌పై పని చేస్తున్నామ’ని ఆయన వెల్లడించారు. ఇది అందుబాటులోకి వస్తే చాలా మందికి చాలా మేలు జరుగుతుందని ఆ సంస్థ నిర్వహించిన సర్వేలో తేలిందంట. అందుకే ఈ ఫీచరును డెవలప్ చేసినట్టు తెలియవస్తోంది.