ఏటీఎంలో ఇరుక్కున్న కార్డు.. ఎలా తీశాడో చూడండి
Editor | 28 July 2022 3:51 AM GMT
సోషల్ మీడియాలో అనేక వీడియోలు దొరుకుతాయి. కొన్ని ఆశ్చర్యకరంగా ఉంటే, మరికొన్ని ఫన్నీగా ఉంటాయి. ఇలాంటి వీడియోలు నెటిజన్లను ఆకట్టుకొని ఎక్కువ వ్యూస్ సొంతం చేసుకుంటాయి. ఈ కోవలో వచ్చే ఓ ఫన్నీ వీడియో ఇది. రెండున్నర లక్షల లైక్స్ సాధించిన ఈ వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి డబ్బులు డ్రా చేయడం కోసం ఏటీఎం కేంద్రానికి వెళ్తాడు. డెబిట్ కార్డును తీసి మెషీన్‌లో పెట్టగా, అది అక్కడే ఇరుక్కుపోతుంది. ఎంత ప్రయత్నించినా అందులోంచి బయటకు రాదు. దీంతో సదరు వ్యక్తి ఓ ఉపాయం ఆలోచించాడు. వెంటనే తన వద్ద ఉన్న కటింగ్ ప్లేయర్ తీసి బలంగా లాగుతాడు. దాంతో కార్డు బయటకి వచ్చేస్తుంది. కార్డును జాగ్రత్తగా పరిశీలించి ఎలాంటి డ్యామేజ్ కాలేదని జేబులో పెట్టుకొని వెళ్లిపోతాడు. చాలా మందికి ఎదురయ్యే ఈ సమస్యకు పరిష్కారం అంటూ పలువురు కామెంట్ చేస్తున్నారు.
Updated : 28 July 2022 3:51 AM GMT
Next Story
© 2017 - 2018 Copyright Telugu News - Mic tv. All Rights reserved.
Designed by Hocalwire