A person who cleans a scooty with a national flag
mictv telugu

వీడియో : జాతీయ జెండాతో స్కూటీ క్లీనింగ్.. కేసు నమోదు

September 8, 2022

A person who cleans a scooty with a national flag

దేశంలోని ప్రజలంతా స్వాతంత్ర్య దినోత్సవం నాడు వజ్రోత్సవ వేడుకలు జరుపుకున్న విషయం తెలిసిందే. ఆ సమయంలో కోట్ల మంది కోట్ల సంఖ్యలో జాతీయ జెండాలను కొనుగోలు చేసి వందనం సమర్పించి తమ భక్తిని చాటుకున్నారు. అయితే ఆ తర్వాత తమ వద్ద ఉన్న జెండాలను ఏం చేయాలో ఇప్పటికే చాలా మంది అవగాహన కల్పించారు. అలా కాకుండా జెండాను అగౌరపరిస్తే పడే శిక్షల గురించి కూడా చెప్పడం జరిగింది.

ఈ విషయం ఈ ప్రబుద్ధుడికి తెలియదనుకుంటా. జెండాతో ఏకంగా తన స్కూటీని తుడిచేశాడు. క్లీనింగ్ గుడ్డలా వాడుకున్నాడు. ఇదంతా ఎవరో వీడియో తీయడంతో ట్విట్టర్‌లో వైరల్ అయింది. దీంతో 1971లోని సెక్షన్ – 2 కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు వీడియో ఆధారంగా విచారణ ప్రారంభించారు. ఈశాన్య ఢిల్లీలోని భజన్ పురా ప్రాంతంలోని ఉత్తర ఘోండాలో నివసించే వ్యక్తి (52) ఈ పని చేసినట్టు గుర్తించారు. దీంతో ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి జాతీయ జెండా, స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. కానీ, ఉద్దేశపూర్వకంగా అలా చేయలేదని, పొరపాటున అలా జరిగిందని సదరు వ్యక్తి చెప్పినట్టు సమాచారం.