A pilot died while another was injured after a plane crashed into a temple in Madhya Pradesh
mictv telugu

ఆలయాన్ని ఢీకొన్న విమానం..పైలెట్ మృతి

January 6, 2023

మధ్యప్రదేశ్‌లో విమాన ప్రమాదం జరిగింది. రేవాలోని ఓ గుడి గోపుర భాగాన్ని ట్రైనీ విమానం ఢీకొని కూలిపోయింది. ఈ ఘటనలో ఓ ట్రైనీ పైలట్ మరణించగా మరో పైలట్ తీవ్రంగా గాయపడ్డాడు. పొగ మంచు ఎక్కువగా ఉండడంతో ఎత్తుగా ఉండే గుడి గోపురం కనబడక నేరుగా వెళ్లి విమానం గుద్దేసింది. రాత్రి 11.30 గంటలకు పైలట్ కెప్టెన్ విమల్ కుమార్ పాట్నాకు చెందిన విద్యార్థి సోనూ యాదవ్‌కు శిక్షణ ఇస్తున్నాడు. సోనూ యాదవ్‌ ఫ్లైట్ నడుపుతుండగా విమల్ పక్కన ఉండి సూచనలు చేస్తున్నాడు. ఈ క్రమంలో పొగమంచు వల్ల సరిగా కనిపించకపోవం, సోనూ సరైన అవగాహన లేకపోవడంతో విమానం ఆలయా శిఖరాన్ని ఢీకొట్టింది. ఈ సమయంలో భారీ పేలుడు సంభవించి విమాన శకలాలు చెల్లాచెదురుగా పడ్డాయి. ప్రమాదం జరిగిన వెంటనే గ్రామస్తుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని, సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన ట్రైనీ పైలట్‌ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, విమానయాన శాఖ అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు.