A plane that landed at the lowest altitude
mictv telugu

వామ్మో.. చేతిని తాకేంత ఎత్తులో విమానం ల్యాండింగ్.. వీడియో

August 12, 2022

A plane that landed at the lowest altitude

గ్రీస్‌లోని బీచ్ పక్కన ఉండే స్కియాథోస్‌ విమానాశ్రయం అందమైన వీక్షణలకు ప్రసిద్ధి. ఈ ప్రాంతానికే ప్రత్యేకమైన విమానాల ల్యాండింగ్ చూడటానికి ప్రతిరోజూ అధిక సంఖ్యలో పర్యాటకులు వస్తారు. ఈ విమానాశ్రయం ఇతర అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుల్లా అంత పెద్దగా ఉండదు.

ఒకటిన్నర కిలోమీటర్లే ఉంటుంది. విమానాలు నేరుగా మన తలపై నుంచి ముందుకెళ్లి కొద్ది మీటర్ల దూరంలో ఉన్న రన్ వేపై ల్యాండ్ అవుతూ ఉంటాయి. ఈ ఎయిర్‌పోర్ట్‌ 1972లో ప్రారంభం కాగా, ఇక్కడ దిగేందుకు అనుమతి పొందిన అతిపెద్ద విమానం బోయింగ్‌ 757. అయితే ఆగస్టు 5న ఓ విమానం మాత్రం అత్యంత తక్కువ ఎత్తులో ల్యాండింగ్‌ అయి ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ దృశ్యాలను వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది. విజ్‌ఎయిర్‌ ఎయిర్‌బస్‌ ఏ321నియో ప్లేన్‌.. సముద్ర నీటిని తాకుందా అన్నట్లు వెళ్తూ.. అలెగ్జాండ్రోస్‌ పపడియామంటిస్‌ ఎయిర్‌పోర్ట్‌లో దిగింది. ల్యాండింగ్‌కు కొద్ది సెకన్ల ముందు విమానం ముందు టైర్లు రోడ్డుపై ఉన్న వారిని తాకుతాయా అన్నట్లు కనిపించింది. రన్‌వే ఫెన్సింగ్‌ దాటిన క్రమంలో ఆ గాలికి అక్కడి వారు దూరంగా పడిపోతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఎంతోమంది గాలి వల్ల పడిపోయి గాయాల పాలయినా సరే, ప్రయాణికుల తాకిడి మాత్రం తగ్గలేదు.