A Portuguese company reveals the benefits of drinking beer
mictv telugu

బీరు తాగడం వల్ల దీర్ఘకాలికంగా కలిగే ప్రయోజనాలు ఇవీ

July 12, 2022

మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం అని మనం ఎప్పుడూ వింటూ ఉంటాం. కానీ, మోతాదులో తీసుకుంటే మంచిదేనని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీరుతో కలిగే ప్రయోజనాల గురించి పోర్చుగల్‌కు చెందిన ‘సెంటర్ ఫర్ రీసెర్చ్ ఇన్ హెల్త్ టెక్నాలజీస్ అండ్ సర్వీసెస్’ సంస్థ పలు కీలక విషయాలను వెలుగులోకి తీసుకొచ్చింది. 23 నుంచి 58 ఏళ్ల మధ్య వయసున్న వారికి రోజూ 330 మిల్లీ లీటర్ల బీరు ఇచ్చి అధ్యయం చేశారు. ఫలితంగా బీరులో ఉండే పాలీ ఫెనాల్స్ పేగులకు మంచిదని, దీర్ఘకాలిక వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చని ఈ పరిశోధన తేల్చింది. స్థూలకాయం, మధుమేహం, గుండె జబ్బులను నివారించడంలో బీరు వల్ల పెరిగే బ్యాక్టీరియా కీలక పాత్ర పోషిస్తుందని తెలిపింది. బీరు వల్ల గుండె జబ్బులకు కారణమవుతున్న కొలెస్ట్రాల్, గ్లూకోజు, ట్రైగ్లిజరాయిడ్లను ప్రభావితం అవడం లేదని స్పష్టం చేసింది. కాగా, ఈ నివేదిక సారాంశాన్ని జర్నల్ ఆఫ్ అగ్రికల్చరల్ అండ్ ఫుడ్ కెమిస్ట్రీలో ప్రచురించారు.