ఫేస్‌బుక్ పరిచయం.. పొట్ట కోసి బిడ్డను ఎత్తుకెళ్లింది.. - MicTv.in - Telugu News
mictv telugu

ఫేస్‌బుక్ పరిచయం.. పొట్ట కోసి బిడ్డను ఎత్తుకెళ్లింది..

May 17, 2019

స్నేహాలకు, కమ్యూనికేషన్లకు వాడుకోవాల్సిన సోషల్ మీడియాను కొందరు స్వార్థప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు. అమ్మాయిల ఫొటోలు సేకరించి బ్లాక్ మెయిల్ చేస్తున్న ఉదంతాలను మన చుట్టూనే చూస్తున్నాం. అంతకుమించిన ఘోరాలు కూడా సాగుతున్నాయి. ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన ఓ మహిళ మాయమాటలు చెప్పి  గర్భిణి పొట్ట కోసి బిడ్డను ఎత్తుకెళ్లింది.

A Pregnant Woman In Chicago Was Killed Before Her Baby Was Cut Out Of Her Body by social media friend.

అమెరికాలోని షికాగో నగరంలో ఈ దారుణం వెలుగు చూసింది. మార్లెన్ ఒచోవా లోపేజ్(19) అనే నిండుగర్భిణి గత నెల 23 నుంచి కనిపించకుండా పోయింది. భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు ఆమె ఫేస్‌బుక్  చాటింగ్ వివరాలను కూపీ లాగగా అసలు విషయం తెలిసింది. మార్లెన్‌కు ఫేస్‌బుక్‌లో క్లారిజా ఫిగరోవా అనే మహిళ పరిచయమైంది. పుట్టబోయే బిడ్డకు బట్టలు కొనిస్తానని చెప్పడంతో మార్లెన్ ఇంట్లోంచి బయటికెళ్లింది. తర్వాత మార్లెన్‌కు, క్లారిజాకు గొడవ జరిగింది. క్లారిజా మార్లెన్‌కు బలవంతంగా డెలివరీ చేయడానికి కడుపును గట్టిగా వత్తింది. ప్రసవం కాకపోవడంతో పొట్ట కోసి మగబిడ్డను బయటికి తీసింది. అదే రోజు.. తన బిడ్డకు శ్వాస సరిగ్గా అందడం లేదంటూ 911కు ఎమర్జెన్సీ కాల్ చేసింది. పోలీసులు చిన్నారి ఆమె బిడ్డే అనుకుని ఆస్పత్రిలో చేర్పించారు. అయితే క్లారిజా ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో డీఎన్ఏ పరీక్షలు చేయగా, బిడ్డ తల్లి ఆమె కాదని తేలింది. మార్లెన్ మిస్సింగ్ కేసును, ఈ కేసుతో కలిపి దర్యాప్తు చేయగా మిస్టరీ వీడింది. ప్రస్తుతం బాబుకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. నిందితురాలిని అరెస్ట్ చేశారు.

 

ttt