A rapidly expanding crater in Chile
mictv telugu

చిలీలో వేగంగా విస్తరిస్తున్న భారీ గొయ్యి.. కారణాలపై అన్వేషణ

August 9, 2022

చిలీ దేశంలో జులై 30న ఏర్పడ్డ భారీ గొయ్యి వేగంగా విస్తరిస్తోంది. తాజాగా 160 అడుగుల వెడల్పు, 656 అడుగుల లోతుకి పెరిగిపోయింది. ఇది ఎంత పెద్దదంటే.. గుజరాత్‌లో ఏర్పాటు చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం స్టాట్యూ ఆఫ్ యూనిటీ ఇందులో సులువుగా ఇమిడిపోతుంది. ఈ మిస్టరీ గొయ్యిపై ఆదేశానికి చెందిన నేషనల్ సర్వీస్ ఆఫ్ జియాలజీ అండ్ మైనింగ్ విభాగపు అధికారులు పరిశోధనలు చేస్తున్నారు. ఈ గొయ్యి ఏర్పడిన ప్రదేశానికి అత్యంత సమీపంలోనే అండర్ గ్రౌండ్ మైనింగ్ కార్యకలాపాలు జరుగుతున్నాయి. దాంతో వెంటనే పనులు నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అలాగే అనుమతికి మించి మైనింగ్ కార్యకలాపాలు జరగలేదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. ప్రస్తుతం నీటిని తోడే యంత్రాలను గనిలో దింపారు. గొయ్యి కారణంగా భవిష్యత్తులో భూగర్భ గని ప్రమాదంలో పడినట్టేనని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.