A rare skull is available
mictv telugu

ఈ పుర్రె ధర రూ.162 కోట్లంటా !

November 10, 2022

పాతకాలం నాటి జంతువుల అవశేషాలు, పురాతన వస్తువులు అప్పుడప్పుడు బయటపడుతుంటాయి. వాటి ఆధారంగా చరిత్రను శాస్త్రవేత్తలు అంచనా వేస్తుంటారు. ఎక్కువ డైనోసార్ అవశేషాలు మనకు కనిపించడం చూస్తుంటాం. తాజాగా యూఎస్‌లోని దక్షిణ డకోటలో అరుదైన పుర్రె బయటపడింది. దీనిని టీ రెక్స్ డైనోసర్ పుర్రెగా గుర్తించారు.

దొరికిన పుర్రె సుమారు 76 మిలియన్ల ఏళ్లనాటిది అని పరిశోధకులు భావిస్తున్నారు. దీనిని ఎటువంటి రసాయనలతో సురక్షితంగా ఉంచకపోయిన ఇప్పటివరకు చెక్కు చెదరకపోవడాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి పుర్రె లభించడం అత్యంత అరుదని చెబుతున్నారు. ఈ పుర్రె సుమారు 6 నుంచి ఏడు అడుగులతో 200 పౌండ్ల బరువు వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. దీనిని వేలం వేస్తే సుమారు రూ.122 కోట్లు నుంచి రూ.162 కోట్లు వరకు పలుకుతుందని పరిశోధకులు చెబుతున్నారు.