మధ్యప్రదేశ్‎లో బోరుబావిలో పడిన చిన్నారిని 24గంటలపాటు శ్రమించి రక్షించిన రెస్య్కూ టీం - Telugu News - Mic tv
mictv telugu

మధ్యప్రదేశ్‎లో బోరుబావిలో పడిన చిన్నారిని 24గంటలపాటు శ్రమించి రక్షించిన రెస్య్కూ టీం

March 15, 2023

మధ్యప్రదేశ్‌లోని విదిషా జిల్లాలో ఆడుకుంటూ 60 అడుగుల లోతున్న బోరుబావిలో పడిన చిన్నారి లోకేష్ ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డాడు. వైద్య బృందం చిన్నారిని ఆస్పత్రికి తరలించారు.

వ 60 అడుగుల లోతు ఉన్న బోరుబావిలో 8 ఏళ్ల చిన్నారి నిన్న ఉదయం పడిపోయాడు. అప్పటి నుండి, SDRF మూడు బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఈ సందర్భంగా చిన్నారికి ఆక్సిజన్‌ ​​సరఫరా చేసి ఈరోజు సురక్షితంగా బయటకు తీశారు.

విదిషా జిల్లా లాటేరి తహసీల్‌లోని ఆనంద్‌పూర్ గ్రామ సమీపంలోని ఖేర్ఖేడీ పీఠభూమి సమీపంలోని పొలంలో 8 ఏళ్ల లోకేష్ ఆడుకుంటుండగా..ఒక్కసారిగా పొలంలో ఉన్న బోరుబావిలో పడిపోయాడు. ఈ ఘటన గురించి వెంటనే స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. బోరుబావిలో నుంచి చిన్నారిని బయటకు తీసేందుకు పసహాయక చర్యలు చేపట్టింది. దాదాపు 24 గంటల పాటు చిన్నారిని రక్షించే కార్యక్రమం కొనసాగింది. ఈరోజు ఉదయం 11.30 గంటల ప్రాంతంలో చిన్నారిని బయటకు తీశారు. చిన్నారి ప్రాణాలతో బయటపడటంతో చిన్నారి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.