నీ కోసం వెలసిందీ ప్రేమమందిరం.. నల్లచెరువులో - MicTv.in - Telugu News
mictv telugu

 నీ కోసం వెలసిందీ ప్రేమమందిరం.. నల్లచెరువులో

October 6, 2018

భార్యలపై ప్రేమను కొందరు నగలు, ఇష్టమైన వస్తువులు ఇచ్చి చాటుకుంటారు. షాజ్‌హాన్ చక్రవర్తుల్లాంటి వారైతే కోట్లు ధారపోసి తాజ్ మహళ్లు కడతారు. కానీ సామాన్యులకు కూడా ప్రేమలు, ప్రేమ మందిరాలు ఉంటాయి. భార్యపై ఆపర ప్రేమ ఉన్న ఓ భర్త ఏకంగా గుడినే కట్టాడు. ఐదున్నర దశాబ్దాలపాటు వారు ప్రేమ, ఆప్యాయతలతో కలిసి జీవించారు. ఏడాది క్రితం భార్య మృతిచెందింది. దీంతో ఆమెతో గడిపిన మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూ.. భార్య సంవత్సరీకం సందర్భంగా ప్రేమ నిలయాన్ని నిర్మించాడు. ఈ కార్యక్రమానికి గ్రామస్థులందరి ఆహ్వానించాడు.

ggg

తూర్పుగోదావరి జిల్లా అయినవల్లి మండలం నల్లచెరువుకు చెందిన జాతీయ ఉత్త ఉపాధ్యాయ అవార్డు గ్రహీత మోటురి భైరవస్వామి భార్య సత్యవతి ఏడాది క్రితం మరణించింది. ఆమె జ్ఞాపకార్థం రూ. 3.5 లక్షలతో గ్రామంలో ప్రేమ మందిరం నిర్మించాడు. ఆమె విగ్రహంతోపాటు తన విగ్రహాన్నీ ప్రతిష్టించుకున్నారు. శనివారం ఈ ప్రేమనిలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా భైరవస్వామి మాట్లాడుతూ.. ‘నా భార్య 55 ఏళ్ల ప్రేమకు, వైవాహిక జీవితానికి నిదర్శనంగా ఈ ప్రేమ మందిరాన్ని నిర్మించుకున్నాను. ఇది చూసి తన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను’ అని పేర్కొన్నాడు.