A robot that broke a boy's finger in Russia
mictv telugu

చెస్‌లో రూల్స్ తప్పాడంటూ బాలుడి వేలు విరిచేసిన రోబో.. వీడియో

July 25, 2022

ఈ మధ్య రోబోల పాత్ర సమాజంలో గణనీయంగా పెరుగుతోంది. రోబోలు ఆటలు కూడా ఆడేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మాస్కోలో ఓ అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. రోబోతో ఏడేళ్ల చిన్నారి చెస్ ఆడుతుండగా, రోబో బాలుడి వేలు విరిచేసింది. వివరాల్లోకెళితే.. ప్రతీ ఆటలో ఉన్నట్టే చెస్ ఆటలో కూడా కొన్ని నియమాలు ఉంటాయి. ఈ క్రమంలో ఓ బాలుడు, రోబో కలిసి చెస్ ఆడుతున్నాయి. మ్యాచ్ చాలా ఉత్కంఠగా సాగుతోంది. బాలుడు పావును కదిపిన తర్వాత రోబో తన పావును కదుపుతుండగా, అప్పటివరకు ఆగలేని బాలుడు వెంటనే తన పావును జరుపబోయాడు. ఈ క్రమంలో నియమాన్ని ఉల్లంఘించినందుకు గాను ఆ రోబో పిల్లాడి వేలును విరిచేసింది. ఈ ఘటనపై అక్కడి అధికారులు స్పందిస్తూ ‘బాలుడు టాప్ 30 ప్లేయర్లలో ఒకడు. ఆ రోబో కూడా ఇంతకుముందు చాలా మ్యాచులు ఆడింది. ఇలాంటి ప్రమాద ఘటన జరగడం ఇదే మొదటిసారి’ అని వెల్లడించారు. ఈ వీడియో నెట్టింట్లో షేర్ చేయగా, మనుషులకు ఉన్నట్టు రోబోలకు ఎమోషన్స్ ఉండవు అంటూ కామెంట్లు చేస్తున్నారు.