బైక్ దొంగలు.. ఈ సీన్ చూస్తే వణికిపోవడం ఖాయం! - MicTv.in - Telugu News
mictv telugu

బైక్ దొంగలు.. ఈ సీన్ చూస్తే వణికిపోవడం ఖాయం!

September 27, 2022

ఢిల్లీలో జరిగిన ఈ సంఘటన వీడియో వైరల్ అవుతోంది. ఇద్దరు దొంగలు బైక్ దొంగిలించి పారిపోతుండగా, సమయస్పూర్తితో స్పందించిన సెక్యూరిటీ గార్డు చోరీని అడ్డుకున్నాడు. దాంతో దొంగలకు పట్టపగలే చుక్కలు కనిపించాయి. వివరాల ప్రకారం.. సౌత్ ఢిల్లీలోని ఎవరెస్ట్ అపార్ట్‌మెంటులోకి ఇద్దరు వ్యక్తులు వచ్చి తాము మునిసిపల్ అధికారులమని చెప్పి లోపలికి వెళ్లారు. వారి కదలికలు అనుమానంగా ఉండడంతో సెక్యూరిటీ గార్డు వారిని ఓ కంట కనిపెడుతూనే ఉన్నాడు. మధ్యాహ్న సమయంలో బైకుపై ఓ కొరియర్ బాయ్ లోపలికి వచ్చి తన బైకు తాళాలను తీయకుండానే సరకు డెలివరీ చేయడానికి వెళ్లాడు.

 

దీన్ని గమనించిన ఇద్దరు దొంగలు బైకు తీసుకొని పారిపోయేందుకు ప్రయత్నించగా, బైక్ స్టార్ట్ చేయడాన్ని గమనించిన కొరియర్ బాయ్ గట్టిగా కేకలు వేశాడు. అరుపులు విన్న సెక్యూరిటీ గార్డు అలర్ట్ అయి ఒక్కసారిగా గేటు వేసేశాడు. దీంతో వేగంగా వచ్చిన దొంగలు.. బైక్ గేటు మధ్య ఇరుక్కోవడంతో వారిద్దరూ అక్కడే పడిపోయారు. తర్వాత స్థానికులు వారిని పట్టుకోవడానికి ప్రయత్నం చేయగా, ఒకడు పారిపోయాడు. పట్టుబడిన మరొక దొంగను పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.