అగ్రహీరో నందమూరి బాలకృష్ణ కొన్ని రోజులుగా వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నాడు. తాజాగా అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ లో బాలయ్య మాట్లాడిన కొన్ని మాటలు పై ఏపీ నర్సింగ్ సంక్షేమ సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది. హీరో, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గెస్ట్ గా వచ్చిన ఎపిసోడ్‌లో బాలయ్య తనకి గతంలో జరిగిన యాక్సిడెంట్ గురించి మాట్లాడుతూ.. ‘ఆ నర్సు, దానమ్మ భలే అందంగా ఉందిలే’ అంటూ కామెంట్ చేశాడు. ఈ వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయి అంటూ ఏపీ నర్సింగ్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు స్వచ్ఛంద ప్రసాద్ పేర్కొన్నారు. బాలకృష్ణ వెంటనే ఈ మాటలను వెనక్కి తీసుకోవాలని, నర్సులకు తాను బహిరంగా క్షమాపణలు చెప్పాలి అంటూ డిమాండ్ చేశారు. క్షమాపణలు తెలియజేయకపోతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి అంటూ హెచ్చరించారు.
అంతకుముందు వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ లో కూడా బాలయ్య.. ఈ రంగారావు, ఆ రంగరావు.. ఈ అక్కినేని, తొక్కినేని అంటూ ఏఎన్నార్‌పై వివాదాస్పద కామెంట్లు చేశాడు. ఆయన వ్యాఖ్యలపై అక్కినేని ఫ్యామిలీ మెంబర్స్ నాగచైతన్య, అఖిల్ సీరియస్ గా స్పందించారు. అక్కినేని ఫ్యాన్స్ అసోసియేషన్లు కూడా నిరసనలు తెలిపాయి. దానికి సంజాయిషి ఇస్తూ.. నాగేశ్వర రావుని తాను బాబాయ్ అని పిలుస్తానని, ఆయన కన్న వారి కంటే తననే ప్రేమగా చూసుకునే వాడని చెప్పారు. దీంతో డైరెక్ట్ గా నాగేశ్వర రావుని, ఇన్ డైరెక్టుగా నాగార్జునను అవమానించాడని అక్కినేని ఫ్యాన్స్ ఆరోపించారు. అభిమాన సంఘం క్షమాపణలు చెప్పాలి అని కోరగా బాలయ్య నిరాకరించిన విషయం తెలిసిందే. మరి ఈ కొత్త వివాదంపై ఎలా స్పందిస్తాడో వేచి చూడాలి.