A servant reshma invited the owner's son to her house and entertained him
mictv telugu

యజమానిని ఇంటికి పిలిచి పనిమనిషి వీడ్కోలు.. మనసుని తాకే వీడియో

November 22, 2022

A servant reshma invited the owner's son to her house and entertained him

ధనవంతుల ఇళ్లల్లో పని వాళ్లు, యజమానుల మధ్య వృత్తిపరమైన సంబంధాలే ఉంటాయి తప్ప భావోద్వేగ సంబంధాలు ఉండవు. పనికి తగ్గ వేతనం ఇస్తున్నాం సరిపోతుందనే భావనలో యజమానులు ఉంటే డబ్బులకు పని చేస్తున్నానమనే ఫీలింగ్ పని వాళ్లలో ఉంటుంది. కానీ, కొన్ని ఇళ్లలో దీన్ని మించిన బంధం ఏర్పడుతుంది.

పనివాళ్లు, యజమానుల మధ్య ఒకే కుటుంబం అనే భావన ఉంటుంది. అలాంటి చోట వాళ్ల మధ్య గ్యాప్ వస్తే వెలితిగా అనిపిస్తుంది. ఈ క్రమంలో తమ మధ్య ఉన్న అనుబంధాన్ని చాటుకునేందుకు ప్రయత్నిస్తారు. తాజాగా ఓ పనిమనిషి తన యజమాని కుటుంబానికి చెందిన యువకుడికి ఘనమైన వీడ్కోలు పలికింది. అనీష్ భగత్ అనే యువకుడి ఇంట్లో రేష్మ అనే మహిళ పని చేస్తోంది. చిన్నప్పటి నుంచి యువకుడికి కావాల్సిన అవసరాలన్నీ రేష్మనే చూసుకునేది. ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ప్రేమగా ఉండేది. అనీష్ కూడా ఆమె పట్ల అంతే ప్రేమగా, గౌరవంగా ప్రవర్తించేవాడు. ఈ నేపథ్యంల ఉపాధి నిమిత్తం అనీష్ వేరే ఊరికి వెళ్లాల్సి వచ్చింది. దీంతో భావోద్వేగానికి గురైన రేష్మ.. యజమాని కుమారుడికి ఘనమైన వీడ్కోలు ఇవ్వాలనుకుంది. అనీష్ భగత్ ని ఇంటికి పిలిచి సాంప్రదాయబద్దంగా ఆతిథ్యం ఇచ్చింది. తమకున్న దాంట్లోనే మంచి విందు భోజనం ఏర్పాటు చేసింది. అనీష్ కూడా అంతే మర్యాదగా ఎలాంటి భేషజాలు లేకుండా రేష్మ ఇంటికి వెళ్లి వారి ఆతిథ్యం స్వీకరించాడు. దీనికి సంబంధిచిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రేమ, ఆప్యాయత చూపించే రేష్మ, ఆమె కుటుంబాన్ని వదిలి వెళ్లాలంటే తనకూ బాధగానే ఉందని పోస్టులో రాసుకున్నాడు.