A shocking case of a woman conspiring with her boyfriend to take private videos of her own in-laws
mictv telugu

అత్తామామల బెడ్రూమ్ వీడియోలు లీక్ చేస్తానంటూ కోడలు బెదిరింపు

September 20, 2022

కొందరు ఆడవాళ్లు నేరాల్లో కూడా మగాళ్లతో పోటీపడుతున్నారు. వివాహేతర సంబంధాలు, బ్లాక్ మెయిలింగ్, హనీ ట్రాప్‌లు.. అబ్బో ఒకటేమిటి.. హత్య చేసేందుకు కూడా వెనుకాడట్లేదు. తాజాగా ప్రియుడికి అలవాటు పడ్డ ఓ వివాహిత.. కుటుంబసభ్యుల నుంచి తప్పించుకోవడానికి తెలివిగా పక్కా ప్లాన్ అత్త, మామల బెడ్రూమ్ వీడియోలను సీక్రెట్ కెమెరాలతో రికార్డ్ చేసింది. దేశ రాజధాని ఢిల్లీలోని లక్ష్మీనగర్ లో ఈ ఘటన జరిగింది.

వివరాల్లోకి వెళ్తే.. లక్ష్మీనగర్ ప్రాంతానికి చెందిన ఓ బంగారు ఆభరణాల వ్యాపారికి.. అతని భార్యతో నాలుగేళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. వారిద్దరూ ఒకే ఇంట్లో వేర్వేరు గదుల్లో ఉంటున్నారు. భార్యకు తన స్నేహితుడితో అక్రమ సంబంధం ఉన్నట్లు భర్త ఇటీవల గుర్తించాడు. బండారం బయటపడడంతో ఇంట్లో ఉన్న కోటి రూపాయలకుపైగా విలువైన ఆభరణాలు, కొంత నగదు తీసుకుని భర్త స్నేహితుడితో కలిసి పారిపోయింది. అప్పటి నుంచి ఆ ప్రియుడితో కలిసి ఎంజాయ్ చేస్తోంది.

దీంతో ఆ నగల వ్యాపారి.. భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ విషయం భార్యకు తెలియడంతో ఆమె భర్త కు ఫోన్ చేసి బెదిరింపులకు దిగింది. మర్యాదగా తనపై పెట్టిన కేసు వాపస్ తీసుకోవాలని గట్టి వార్నింగ్ ఇచ్చింది. తమ ఇంట్లో అత్తామామల గదిలో సీక్రెట్ కెమెరాలు పెట్టానని.. వారు ఏకాంతంగా ఉన్నప్పుడు వారిని వీడియోలు తీసానని.. షాకింగ్ విషయాన్ని బయట పెట్టింది. తనపై కేసులు వెనక్కి తీసుకోకపోతే ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ భర్తను బెదిరించింది. దీంతో ఈ విషయాన్ని కూడా భర్త పోలీసులకు తెలిపాడు. ఈ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేశారు.