పిల్లాడిని కరిచి వెంటనే చనిపోయిన త్రాచుపాము - MicTv.in - Telugu News
mictv telugu

పిల్లాడిని కరిచి వెంటనే చనిపోయిన త్రాచుపాము

June 23, 2022

విషపూరిత సర్పం అయిన త్రాచుపాము కాటు వేస్తే సహజంగా మనిషి మరణిస్తాడు. వైద్య సహాయం అందితే తప్ప బతకలేడు. దాని విషం అంత పవర్‌ఫుల్‌గా ఉంటుంది. అయితే బీహార్‌లో రివర్స్ సంఘటన జరిగింది. ఆడుకుంటున్న బాలుడిని కాటు వేసిన త్రాచుపాము కొద్ది సేపటికే మరణించింది. షాకింగ్‌గా ఉన్న ఆ సంఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. గోపాల్ గంజ్ ప్రాంతానికి చెందిన నాలుగేళ్ల అంజు కుమార్ ఇంటి బయట ఆడుకుంటుండగా, త్రాచుపాము వచ్చి కాటు వేసింది. ఈ విషయాన్ని అంజు కుమార్ కుటుంబ సభ్యులకు తెలుపగా, వారు కంగారు పడి ఆసుపత్రికి తరలించేందుకు సమయాత్తమయ్యారు. ఈ క్రమంలో బాలుడిని కాటు వేసిన పాము కొద్ది దూరం వెళ్లి అక్కడే విగతజీవిగా కనిపించింది. దాంతో కుటుంబ సభ్యులు పిల్లాడితో పాటు పామును కూడా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ప్రథమ చికిత్స చేసిన అనంతరం బాలుడు ఆరోగ్యంగానే ఉన్నాడని తేల్చారు. అయితే మరి పాము ఎలా చనిపోయిందో అర్ధం కావట్లేదు. పిల్లాడిని ఆసుపత్రికి తరలించే హడావిడిలో ఎవరూ కూడా పాముకు హాని తలపెట్టలేదు. దీంతో చనిపోయిన పాము, బతికిన బాలుడిని చూసేందుకు చుట్టుపక్కల వారు ఎగబడ్డారు.