A snake's head in the stomach of the meal..here is the video
mictv telugu

భోజనం పేట్లో పాము తల..వీడియో ఇదిగో

July 26, 2022

మనం భోజనం చేస్తున్న సమయంలో పేట్లో ఏ చిన్న దుమ్ముపడినా ఆ ఆహారం తినాలా వద్దా? అని పదే పదే ఆలోచిస్తుంటాము. కొన్ని సందర్భాల్లో తాగే నీరులో గాని, తినే పేట్లో గాని ఏదైనా చిన్న జీవి ( చీమ, ఈగ, దోమ) వంటివి కనబడితే క్షణం ఆలోచించకుండా వెంటనే ఆ ఆహారాన్ని, ఆ నీటిని తినకుండా, త్రాగకుండా డస్ట్ బిన్‌లో పడేస్తాము. కానీ, విమానంలో  విధులు నిర్వహించే ఓ సిబ్బందికి వింత అనుభవం ఎదురైంది. ఆకలితో ఉన్న అతడికి విమాన సిబ్బంది ఇచ్చిన భోజనం పేట్లో పాము తల కనిపించింది. దాంతో అతడు ఒక్కసారిగా షాక్‌కు గురై బెంబేలెత్తిపోయాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

 

వివరాల్లోకి వెళ్తే..టర్కీలోని అంకారా నుంచి జర్మనీలోని డస్సెల్‌డార్ఫ్‌కు వెళ్తున్న సన్‌ఎక్స్‌ప్రెస్‌ విమానంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి ఈ అనుభవం ఎదురైంది. విమానంలో అందించిన ఆహారాన్ని సిబ్బంది తింటుండగా.. ఆలూ, ఇతర కూరగాయలతో చేసిన కూరలో పాము తల కనిపించింది. వెంటనే ఆ సిబ్బంది ఆ దృశ్యాలను వీడియో తీసి ట్విట్టర్‌లో షేర్‌ చేశాడు. ఆ వీడియోలో..ఆహారం వడ్డించిన ప్లేట్‌ మధ్యలో చిన్న పాము తల స్పష్టంగా కనిపిస్తోంది.

అయితే, ఈ ఘటనను అక్కడి అధికారులు తీవ్రంగా ఖండించారు. అనంతరం ఎయిర్‌లైన్స్‌‌లో ఆహారాన్ని సరఫరా చేస్తున్న కాంట్రాక్టును తాత్కాలికంగా నిలిపివేసి, దర్యాప్తు చేపట్టామని తెలిపింది. అంతేకాదు, ముప్పై ఏళ్ల విమాన సేవల్లో ప్రయాణికులకు, సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, సురక్షితమైన ప్రయాణాలను కల్పించటమే తమ లక్ష్యం అని పేర్కొన్నారు.