కసాయోడు..జూమ్ లైవ్ లో తండ్రిని చంపాడు - Telugu News - Mic tv
mictv telugu

కసాయోడు..జూమ్ లైవ్ లో తండ్రిని చంపాడు

May 22, 2020

Zoom

జనాల్లో రోజురోజుకి క్రూరత్వం పెరిగిపోతుంది. కన్న తలిదండ్రులని కూడా జాలిలేకుండా కడ తేర్చుతున్నారు. ఇటీవల అమెరికాలోని అమిటీవిల్లేలో జరిగిన ఓ సంఘటనే ఇందుకు నిదర్శనం. ఓ కసాయి కొడుకు తండ్రిని కత్తితో పొడిచి చంపుతూ ఇందుకు సంబంధించిన దృశ్యాలను జూమ్‌ వీడియో లైవ్‌లో చూపించాడు.

డ్వైట్‌ పవర్స్‌(70) తన స్నేహితులతో జూమ్‌ యాప్‌లో మాట్లాడుతున్నాడు. అదే సమయంలో ఇంట్లోకి వచ్చిన ఆయన కుమారుడు స్కల్లీ పవర్స్‌(32) ఓ కత్తితో తండ్రిని దారుణంగా పొడుస్తూ లైవ్‌లో ఆ దృశ్యాన్ని అలాగే చూపించాడు. దీంతో డ్వైట్‌ స్నేహితులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకునే లోపే డ్వైట్‌ మరణించాడు. అలాగే నిందితుడు స్కల్లీ అక్కడి నుంచి పారిపోయాడు. పోలీసులు గాలించి స్కల్లీని అరెస్ట్ చేశారు.