టాలీవుడ్ మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ తేజ…మెగాస్టార్ చిరంజీవి నటవారసుడిగా చిరుత మూవీతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత వచ్చిన మగధీర మూవీతో టాలీవుడ్లో అప్పటివరకు ఉన్న రికార్డులన్నీ బద్దలుకొట్టారు. గతేడాది రాజమౌళి డైరెక్షన్ చేసిన ఆర్ఆర్ఆర్ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా తన యాక్టింగ్‌తో ఆకట్టుకున్నారు. అసలు యాక్టింగే రాదన్న విమర్శకుల నోటి నుంచి ప్రశంసలు అందుకునేలా నాటు నాటు పాటతో అంతర్జాతీయ స్థాయి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు పాన్ ఇండియా నుంచి గ్లోబల్ స్టార్‌గా ఎదిగారు రాంచరణ్ తేజ. నేడు రాంచరణ్ తేజ పుట్టిన రోజు సందర్భంగా స్పెషల్ స్టోరీ.
రామ్‌చరణ్ తేజ…చిరుత సినిమాతో సినీపరిశ్రమలోకి అడుగుపెట్టారు. మగధీరతో రికార్డులు బ్రేక్ చేశారు. ఆర్ఆర్ఆర్తో సంచలనం క్రియేట్ చేశారు. లోకల్ స్టార్‌గా ఉన్న రామ్ చరణ్ ఇఫ్పుడు గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు. ప్రముఖ దర్శకుడు పూరీజగన్నాథ్ డైరెక్షన్లో తెరకెక్కిన చిరుత సినిమాతో తెరంగేట్రం చేసిన రామ్ చరణ్…తొలి మూవీతో మంచి విజయాన్ని అందుకున్నారు. అయితే నటుడు అన్నాక కొన్ని ఒడిదొడుకులు ఉంటాయి. అది రామ్ చరణ్ విషయంలోనూ ఉన్నాయి. మెగాస్టార్ కుమారుడైనప్పటికీ ..కొన్ని సినిమాల వల్ల ఎన్నో అవాంతరాలు ఎదుర్కొన్నారు. రామ్ చరణ్‌కు యాక్టింగ్ రాదంటూ కొన్ని సినిమాలు మొదలుపెట్టి ఆపేసారు. అందులో కొరటాల శివ మూవీ కూడా ఒకటి.
మగధీర సక్సెస్ తర్వాత ఆరెంజ్ సినిమాకు ఓకే చెప్పాడు. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తీవ్రంగా నిరాశ పరిచింది. ఈ మూవీ బిగ్ డిజాస్టర్‌గా మిగిలింది. నిర్మాతగా వ్యవహారించిన నాగబాబును నిండా ముంచేసింది. దీంతో అప్పుల బాధలో నుంచి బయటపడేందుకు ఆత్మహత్యకు కూడా ప్రయత్నించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ మూవీ ఎంత దారుణమైన ఫలితం ఇచ్చిందో అర్థమైంది. అయితే ఆరేంజ్ తర్వాత మెరుపు సినిమా మొదలుపెట్టి ఆపేశారు. మెరుపు సినిమా ఆగిపోవడానికి ఆర్థిక ఇబ్బందులు మాత్రమే కాదని..రాంచరణ్ పై ఈ బడ్జెట్ వర్కవుట్ కాదని ఆపేసారన్న వార్తలు గుప్పుమన్నాయి.
కెరీర్ మొదట్లో ఎన్నో అవాంతరాలు వచ్చినా..ఒక్కో మెట్టు ఎక్కుతూ నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు రాంచరణ్ తేజ. మొదట్లో ఈయన నటుడే కాదన్నారు. అన్ని సన్నివేశాలకు ఒకే ఎక్స్ ప్రెషన్ ఇస్తున్నాడన్న విమర్శలు కూడా ఎదుర్కొన్నాడు. కానీ ఇఫ్పుడు నటుడంటే ఇలా ఉంటాడురా అనిపించేలా చేశాడు. మెగాస్టార్ చిరంజీవికి తగ్గ తనయుడు కాదని…ప్రయోగాలంటే భయపడతాడరన్నారు. కానీ ఇప్పుడు కొత్త కథలకు నేను రెడీ అంటున్నాడు. దర్శకులకే ఆయనకోసం ఎగబడుతున్నారు.
బ్యాడ్ బాయ్ అంటూ విమర్శించినవారే ఇప్పుడు నెత్తిన పెట్టుకుంటున్నారు. ఇలా తన ఇమేజ్ను మార్చుకున్నారు రాంచరణ్ తేజ. ప్లస్‌లు మైనస్లతో తన కెరీర్లో దూసుకుపోతూ గ్లోబల్ స్టార్‌గా ఎదిగాడు.