వింత ఘటన.. పొట్టేలుకు మూడేళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు - MicTv.in - Telugu News
mictv telugu

వింత ఘటన.. పొట్టేలుకు మూడేళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు

May 24, 2022

ఆఫ్రికా దేశమైన సూడాన్‌లో వింత ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ మరణానికి కారణమైందని అక్కడి స్థానిక కోర్టు ఓ పొట్టేలుకు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. అంతేకాక, జైలు శిక్ష పూర్తయిన తర్వాత పొట్టేలును బాధిత కుటుంబానికి ఇచ్చేయాలని ఆదేశించింది. ప్రపంచవ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేసిన ఈ కేసు వివరాలు ఇలా ఉన్నాయి. అకుల్ మోల్ అనే ప్రాంతంలో దుయోని మాన్యాంగ్ ధాల్ అనే గొర్రెల కాపరి నివాసం ఉంటున్నాడు. అతని పక్క ఇంటిలోనే 45 ఏళ్ల మహిళ నివసిస్తోంది. ఓ రోజు పొట్టేలు సదరు మహిళపై దాడి చేసింది.

పలుమార్లు ఒకే చోట దాడి చేయడంతో మహిళ పక్కటెముకలు విరిగిపోయాయి. అనంరతం అంతర్గత రక్తస్రావం జరిగి ఆ మహిళ చనిపోయింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పొట్టేలును ఆధీనంలోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం కోర్టులో కేసు వేశారు. విచారించిన కోర్టు పొట్టేలు తప్పును నిర్ధారించి మూడేళ్ల జైలు శిక్షను విధించింది. దాని యజమాని అమాయకుడు కాబట్టి అతడిని వదిలేసింది. కానీ, మూడేళ్ల శిక్ష తర్వాత పొట్టేలును బాధిత మహిళ కుటుంబానికి ఇచ్చేయాలని ఆదేశించింది. అంతేకాక, మహిళ కుటుంబానికి ఐదు ఆవులను పరిహారంగా ఇవ్వాలని సూచించింది. ఈ మేరకు రెండు కుటుంబాల వ్యక్తులు కోర్టు సమక్షంలో ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఈ విషయం ప్రస్తుతం వైరల్ అవుతోంది. పొట్టేలుకు శిక్ష విధించిన వైనంపై ఆశ్చర్యపోతున్నారు.