a Tamil Nadu man participating in Mr. Asia competitions
mictv telugu

ఈ తాత కెవ్వు కేక.. 72 ఏళ్ల వయసులో మిస్టర్ ఆసియా బరిలోకి

June 24, 2022

a Tamil Nadu man participating in Mr. Asia competitions

కృష్ణా, రామా అంటూ చివరి రోజులను లెక్కపెట్టాల్సిన వయసులో బాడీ బిల్డింగ్ చేసి పోటీల్లో పాల్గొంటున్నాడు తమిళనాడుకు చెందిన 72 ఏళ్ల వ్యక్తి. ఆధునిక కాలంలో 40 ఏళ్లకే వివిధ రోగాలు తెచ్చుకుంటుండగా, జిమ్నాస్ట్ చేసి, ఎంతో మంది యువకులకి శిక్షణ ఇస్తున్నాడు. వృద్ధుడు అనే కంటే యువకుడు అనాల్సిన ఈ వ్యక్తి పేరు రత్నం. తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లా మధురాంతకానికి చెందిన వారు. 60 ఏళ్ల వయస్సులోనూ ఇంకా ఫిట్‌గా ఉన్న మాజీ డీజీపీ శైలేంద్రబాబును ఆదర్శంగా తీసుకొని, కష్టపడి ఫిట్‌నెస్ సాధించాడు.

గతంలో మిస్టర్ కంచి, తమిళనాడు, సౌత్ ఇండియా, మిస్టర్ ఇండియా పోటీల్లో పాల్గొన్నాడు. గత మే 22న హిమాచల్ ప్రదేశ్‌లో జరిగిన ఫిట్‌నెస్ మాస్టర్ విభాగంలో పాల్గొని బాడీ బిల్డింగ్ పోటీలకు అర్హత సాధించాడు. దాంతో జులై 15న మాల్దీవుల్లో జరిగే మిస్టర్ ఆసియా పోటీలకు ప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని దక్కించుకున్నారు. అంతేకాక, డిసెంబర్ 5న థాయ్‌లాండ్‌లో జరిగే ప్రపంచ పురుషుల ఛాంపియన్‌షిప్‌లో కూడా పాల్గొననున్నాడు. ఇన్ని ఘనతలు సాధిస్తున్న తమ గురువు గారి అంకిత భావం పట్ల ఆయన శిష్యులు గర్వంగా ఫీలవుతున్నారు.