A teacher found red-handed while drinking beer in class in uttar pradesh
mictv telugu

క్లాసులో బీర్ తాగుతూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన టీచర్.. వీడియో వైరల్

October 3, 2022

A teacher found red-handed while drinking beer in class in uttar pradesh

విద్యార్ధులకు మంచి చదువులు, నడవడిక చెప్తూ వారిని సన్మార్గంలో పెట్టాల్సిన టీచర్లు.. ఇటీవల కొన్ని ఘటనలు చూస్తే బాగా పాడైపోయారనిపిస్తోంది. లైంగిక వేధింపులు, అత్యాచార యత్నాలు వంటి చేష్టలతో పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తికి కళంకం తెస్తున్నారు. ఈ కోవలోకి చేరే ఓ ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. ఓ టీచరు ఏకంగా క్లాసురూంనే బార్‌గా మార్చేశాడు.

పట్టపగలు తరగతి గదిలో విద్యార్ధుల ముందే బీర్ తాగుతూ అడ్డంగా దొరికిపోయాడు. వివరాల్లోకెళితే.. హత్రాస్ డీఆర్బీ ఇంటర్ కాలేజీలో అసిస్టెంట్ టీచరుగా పని చేస్తున్న శైలేంద్ర సింగ్ గౌతమ్‌పై గతంలో అనేక ఆరోపణలు వచ్చాయి. తోటి సిబ్బందితో దురుసుగా ప్రవర్తించడం, క్లాసులోనే మందు తాగడం వంటి ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో క్లాస్ రూంలోనే స్టూడెంట్స్ ముందు బీరు తాగుతుండగా తోటి సిబ్బంది వీడియో తీశారు. వీడియో తీయవద్దని గౌతమ్ హెచ్చరిస్తుండడం వీడియోలో రికార్డయింది. పక్కనే మరో మహిళా టీచరు ఉన్నా ఏమీ అనకపోవడం గమనార్హం. వీడియో వైరల్ కావడంతో స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం టీచరుని సస్పెండ్ చేసింది. అనంతరం విచారణకు ఆదేశించింది. దీనిపై నెటిజన్లు కామెంట్లతో టీచరు, ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు.