A teacher lost her job because she saw a cat..where?
mictv telugu

పిల్లి కనపడిందని టీచర్ ఉద్యోగం ఊడింది..ఎక్కడంటే?

August 22, 2022

A teacher lost her job because she saw a cat..where?

ప్రపంచవ్యాప్తంగా రెండు సంవత్సరాలపాటు కరోనా మహమ్మారి ప్రజలను, వ్యాపారులను, ఉద్యోగులను, విద్యార్థులను అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయా దేశాల్లో విద్యా వ్యవస్థ పూర్తిగా నష్టపోయే పరిస్థితికి చేరుకోవడంతో పిల్లల తల్లిదండ్రులు ఆన్‌లైన్‌లో పాఠాలను చెప్పాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. దాంతో స్పందించిన ఆయా ప్రభుత్వాలు కరోనా అదుపులోకి వచ్చేవరకు ఆన్‌లైన్‌లోనే పాఠాలను చెప్పారు. అయితే, ఓ టీచర్ ఆన్‌లైన్‌లో పాఠం చెప్తుండగా పిల్లి కనిపించదని ఆ పాఠశాల యాజమాన్యం ఆ టీచర్ ఉద్యోగాన్ని తీసేసిన సంఘటన సంచలనంగా మారింది.

వివరాల్లోకి వెళ్తే.. చైనాలోని గాంగ్‌ఝోలో నివాసముండే లూవో అనే వ్యక్తి ఆర్ట్ టీచర్‌గా ఒక ఎడ్‌టెక్ కంపెనీలో ఆన్‌లైన్‌లో పిల్లలకు డ్రాయింగ్ బోధిస్తున్నాడు. ఇంతలో ఇంట్లోని ఆయన పెంపుడు పిల్లి ల్యాప్‌టాప్ కెమెరా ముందుకు దూకింది. ఇలా నాలుగైదు సార్లు జరిగింది. దీన్ని సీరియస్‌గా తీసుకున్న ఆ ఎడ్ టెక్ కంపెనీ యాజమాన్యం.. లూవోను ఉద్యోగంలోంచి తీసేసింది. ఈ నిర్ణయాన్ని అతడు ఆర్బిట్రేషన్‌లో సవాల్ చేయగా..లువోకు నష్టపరిహారం చెల్లించాలని సదరు కంపెనీని కమిటీ ఆదేశించింది. ఈ తీర్పును వ్యతిరేకిస్తూ ఆ ఎడ్‌టెక్ కంపెనీ కోర్టులో పిటీషన్ వేసింది.

”లువో ప్రవర్తన టీచర్ కోడ్ ఆఫ్ కండక్ట్‌కు విరుద్ధంగా ఉంది. క్లాస్‌కు 10 నిమిషాలు ఆలస్యంగా వచ్చారు. క్లాస్ టైంలో వేరే పనులు చేశారు” అని ఎడ్‌టెక్ కంపెనీ వాదించింది. ఆ వాదనను తోసిపుచ్చిన కోర్టు కూడా కమిటీ నిర్ణయాన్నే సమర్థించి. దాంతో లువోకు రూ.4.6 లక్షలు (40 వేల యువాన్లు) నష్ట పరిహారంగా చెల్లించాలని తేల్చి చెప్పింది.