A Temple staff accidentally hands over a bag with Rs.2.9 lakh cash along with the laddu to a devotee
mictv telugu

భక్తుడికి భలే ఆఫర్.. ప్రసాదం కోసం చేయి చాపితే రూ.లక్షలు ఇచ్చారు

July 30, 2022

అప్పుడే ఆలయంలో జనం మధ్యలో అతి కష్టం మీద దైవ దర్శనం చేసుకున్న ఆ భక్తుడు… ప్రసాదం కోసం వెంటన కౌంటర్ వద్దకు వెళ్లాడు. అక్కడ కూడా మిగతా భక్తుల తాకిడి ఎక్కువగానే ఉంది. కౌంటర్ లో నిలుచున్న ఆ భక్తుడు తన వంతు కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే హడావుడిలో ఉన్న ప్రసాదం అందజేసే అధికారి లడ్డుకి బదులు రూ. 2.91 లక్షలు ఉన్న బ్యాగును భక్తుడికి ఇచ్చేశాడు. ఈ సంఘటన కర్ణాటకలోని చామరాజనగర్లో జరిగింది.

హనుర్ తాలుకాలోని మలిమహాదేశ్వర్ కొండపై ఉన్న గుడికి అమవాస్య సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ క్రమంలోనే ప్రత్యేక దర్శనం వద్ద విధులు నిర్వహిస్తున్న అధికారి.. లడ్డు ప్రసాదంతో పాటు పొరపాటున రూ. 2.91 లక్షల బ్యాగును భక్తుడికి అందజేశారు. ఆ తర్వాత తేరుకున్న అధికారి చూడగా డబ్బుల బ్యాగు కనిపించలేదు. బ్యాగు కోసం ఎంత వెతికినా జాడ లేదు. చివరకు సీసీటీవీ కెమెరాను పరిశీలించగా.. పొరపాటున భక్తుడికి ఇచ్చిన విషయం బయటపడింది. ఈ డబ్బు దేవస్థానానికి సంబంధించినదని.. ఖాతాలో జమ చేయడానికి తీయగా ఇలా జరిగిందని అధికారులు తెలిపారు. అయితే ఆ భక్తుడి గురించి మాత్రం ఇంకా తెలియరాలేదు.