Nigeria Train Crash: నైజీరియాలో ఘోర ప్రమాదం..బస్సును ఢీకొట్టిన రైలు..!! - MicTv.in - Telugu News
mictv telugu

Nigeria Train Crash: నైజీరియాలో ఘోర ప్రమాదం..బస్సును ఢీకొట్టిన రైలు..!!

March 10, 2023

నైజీరియాలోని లాగోస్‌లో ఘోర ప్రమాదం జరిగింది. గురువారం ప్రయాణికుల బస్సును రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు, పదుల సంఖ్యలో గాయపడ్డారు. దేశ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఏజెన్సీ ఈ సమాచారాన్ని ఇచ్చింది. ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఏజెన్సీ అందించిన సమాచారం ప్రకారం, బస్సు ప్రభుత్వ ఉద్యోగులను పని కోసం తీసుకెళ్తుండగా బస్సును ఇంటర్‌సిటీ రైలు ఢీకొట్టింది.

నైజీరియా నేషనల్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ అధిపతి ఇబ్రహీం ఫారిన్‌లోయ్ మాట్లాడుతూ, “ఇప్పటివరకు 84 మందిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించారు. ఫారిన్‌లాయ్ కు చెందిన బస్సు ప్రభుత్వ ఉద్యోగులను కార్యాలయానికి తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు చెప్పారు. బస్సు డ్రైవర్ తప్పిదం వల్లే ఈ ప్రమాదం జరిగిందని లాగోస్ స్టేట్ ఎమర్జెన్సీ మేనేజ్ మెంట్ ఏజెన్సీ కార్యదర్శి ఒలుఫెమి ఒకే ఒసానింటోలు తెలిపారు. డ్రైవర్ బస్సును నిర్లక్ష్యంగా నడపడం వల్లే ఈ ఘోరం జరిగిందన్నారు. బస్సు డ్రైవర్ ట్రాఫిక్ సిగ్నల్ ఏమాత్రం పట్టించుకోలేదన్నారు.