ఫ్రాన్స్ లో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. 40మంది చిన్నారులను తీసుకెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 21మంది చిన్నారులు గాయపడ్డారు. వారిని వెంటనే సహాయక సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్, అతని సహచరుడు తీవ్రంగా గాయపడ్డారు. పాఠశాలకు చెందిన బస్సు విద్యార్థులను తీసుకొని వెళ్తుండగా కాలువలో పడినట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి వెళ్లి సహాయకచర్యలు ముమ్మరం చేశారు. గాయపడిన విద్యార్థుల ఆసుపత్రిలో పొందుతున్నారు. వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
తాజాగా మెక్సికోలో కూడా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మెక్సికోలోని ప్యూబ్లా రాష్ట్రంలో బస్సు ప్రమాదంలో కనీసం 17 మంది వలసదారులు మరణించారు. ప్యూబ్లా ఇంటీరియర్ సెక్రటరీ జూలియో హుర్టా ప్రకారం, చనిపోయిన వారందరూ వలసదారులే. వీరిలో వెనిజులా, కొలంబియా, మధ్య అమెరికా నుండి వలస వచ్చినవారు ఉన్నారు. దక్షిణ రాష్ట్రమైన ఓక్సాకా నుంచి వస్తున్న హైవేపై ఈ ప్రమాదం జరిగిందని హుర్టా తెలిపారు. వలసదారులు సరిపడా పత్రాలతో ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోందని ఆయన అన్నారు. 45 మంది ప్రయాణికుల్లో 15 మంది అక్కడికక్కడే మృతి చెందారని తెలిపారు. ఇద్దరు ఆసుపత్రిలో మరణించారని వెల్లడించారు.
RSOE EDIS Event Report – Public road accident – France – Bus with 40 children crashes in France, 21 injured – https://t.co/YrNJ6Rhheh
— RSOE EDIS (@RSOE_EDIS) March 4, 2023