కొంతమంది ఉంటారు.. నిబంధనలు పాటించాలనే బోర్డులను చూసి.. వాటిని బ్రేక్ చేస్తే కిక్, మజా అని అనుకుంటారు. అలా చేసి హీరో అవుదామనుకున్న ఓ వ్యక్తిని.. ఓ మూగ ప్రాణి సుస్సు పోయించి జీరోని చేసింది. దెబ్బకు ఆ హీరో కానీ జీరోకి చుక్కలు కనిపించాయి. ఇండోనేషియాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి వీడియోను చూస్తే.. కచ్చితంగా అతనికి తగిన శాస్తే జరిగిందటారు ఎవరైనా. వైరల్ వీడియో ప్రకారం.. ఓ ఆకతాయి.. గొరిల్లా బంధించి ఉన్న బోన్ దగ్గరకు వెళ్లి వెకిలి చేష్టలు, పిచ్చి సైగలు చేశాడు. ఆ జంతువుకు ఎక్కడో మండి.. అతడి షర్ట్ పట్టుకుని దగ్గరకు లాగింది. మరో వ్యక్తి అతడ్ని రక్షించేందుకు ప్రయత్నించినా.. ఏ మాత్రం వదలకుండా అతడి కాలు పట్టుకుని బోన్లోకి లాగేయాలని గట్టిగా ప్రయత్నించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
జూన్ 6న ఇండోనేషియాలోని కసంగ్ కులిం జూలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. జూ అధికారులు లంచ్ విరామంలో ఉండగా ఈ సంఘటన జరిగిందని.. జంతువులకు దగ్గరగా వెళ్ళకూడదని వార్నింగ్ బోర్డులు పెట్టినా.. ఆ యువకుడు వాటిని ఉల్లంఘించి గొర్రిల్లా బోన్ దగ్గర ఉన్న గార్డ్‌రైల్ దూకి మరీ.. ఆ జంతువును ఎగతాళి చేశాడని జూ అధికారి ఒకరు తెలిపారు. ఈ వీడియోపై నెటిజన్లు కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.
A terrifying tug-of-war after orangutan attacks man through cage
terrifying, tug-of-war , orangutan attacks man, through cage, Indonesian zoo, ape dragging the man , grabbing his legs ,
lu yang berak ya? pic.twitter.com/FVKE6DUV2r
— neutral⚛ (@neutralizm_) June 7, 2022