చోరీకి వచ్చి తల ఇరుక్కుని చనిపోయాడు - MicTv.in - Telugu News
mictv telugu

చోరీకి వచ్చి తల ఇరుక్కుని చనిపోయాడు

November 28, 2022

చోరీకి వచ్చిన దొంగ తల తలుపు సందులో ఇరుక్కుని చనిపోయాడు. ఈ విచిత్ర సంఘటన ఉత్తర ప్రదేశ్ వారణాసిలో జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. 30 ఏళ్ల జావేద్ అనే వ్యక్తి నిజాం అనే వ్యక్తికి చెందిన విద్యుత్ యంత్రాలతో నడిచే మగ్గం సెంటర్లోకి చోరీకి యత్నించాడు. ఆ సెంటర్ రెండురోజుల నుంచి మూతపడి ఉండడాన్ని గమనించిన జావేద్.. చోరీకి సులువుగా ఉంటుందని దాన్ని ఎంచుకున్నాడు. సెంటర్ కి వచ్చిన దొంగ తలుపులు బద్దలు కొట్టే ప్రయత్నం చేసి అనంతరం తల బలవంతంగా లోపలకి పెట్టడంతో అది అక్కడే ఇరుక్కుపోయింది.

తలుపుకు పైన తాళం వేసి ఉందని గ్రహించని దొంగ.. తల లోపల ఇరుక్కుని మిగతా శరీరం మాత్రం బయటే ఉండిపోవడంతో నరకయాతన అనుభవించాడు. ఎంత ప్రయత్నించినా తల బయటికి రాకపోవడంతో చివరికి అక్కడే ప్రాణాలు వదిలాడు. ఉదయం సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకొని పోస్టుమార్టం నిమిత్తం శవాన్ని ఆస్పత్రికి తరలించారు. సదరు జావేద్ అనే దొంగ ఇప్పటికే పలు కేసుల్లో నిందితుడిగా గుర్తించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.