A Tik Tok star living with a doll
mictv telugu

బొమ్మతో సహజీవనం.. ఇద్దరు సంతానం.. ఇప్పుడు మరో ట్విస్ట్

August 29, 2022

A Tik Tok star living with a doll

ఈ మధ్య కాలంలో పెళ్లి వద్దు, కుటుంబం వద్దు. సోలో బతుకే సో బెటరు అని భావించే వారి సంఖ్య పెరిగిపోతోంది. పెళ్లి, బాధ్యతలు ఇష్టం లేకనో లేక జీవితం మీద విరక్తో తెలియదు కానీ, తమకిష్టమైన జీవితం గడపడానికి మొగ్గు చూపుతున్నారు. అయితే మరికొంతమంది మరీ విచిత్రంగా తయారవుతున్నారు. సోలోగా ఎందుకుండాలి. పెళ్లంటే మనిషినే చేసుకోవాలా? బొమ్మలను చేసుకోకూడదా? అంటూ తలతిక్క నిర్ణయాలు తీసుకుంటున్నారు. బొమ్మలను ప్రేమించి, వాటితో పిల్లలను కని, ఏకంగా పెళ్లి చేసుకునే వరకు వెళ్తున్నారు.

ఇదెలా సాధ్యమనుకుంటున్నారా.. అయితే ఈ కథనం పూర్తిగా చదవండి. టిక్‌టాక్‌లో ఫేమస్ అయిన @montbk5959 అనే యూజర్ తన గురించిన విషయాలను చెప్పుకొచ్చాడు. తాను ఒంటరిగా లేనని, రాగ్ డాల్‌తో ఏడాది నుంచి సహజీవనం చేస్తున్నానని చెప్పుకొచ్చాడు. తన లవర్ (బొమ్మ)తో వివాహాన్ని ప్లాన్ చేసుకుంటున్నట్టు వెల్లడించాడు. తన భార్యకు నటాలియా అనే పేరు కూడా పెట్టినట్టు పేర్కొన్నాడు. అంతేకాక, తమకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని యూజర్ తెలిపాడు. నలుగురు సభ్యులున్న కుటుంబంతో కలిసి సరదాగా టీవీ చూస్తానని, ప్రతిదాని గురించి చర్చిస్తామని వివరించాడు. ఇంతకీ పిల్లలెలా కలిగారనే కదా మీ అనుమానం. ఏం లేదు. బొమ్మ పెళ్లాం లాగా బొమ్మ పిల్లలు అన్నమాట. ఇక తమ పెళ్లి త్వరలో ఉంటుందంటూ అతను పెట్టిన ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు తమకు తోచిన కామెంట్లు పెడుతున్నారు. ఇక ఇలాంటి పెళ్లిళ్ల విషయానికి వస్తే గతంలో ఓ మహిళ ఇలాగే ఓ బొమ్మను పెళ్లి చేసుకుంది. అతను నాతో పోరాడడు, వాదించడు, నన్ను అర్ధం చేసుకుంటాడు. అతను గొప్ప నమ్మకమైన భర్త అంటూ ఓ రేంజ్‌లో పొగిడేసింది. అలాంటి వ్యక్తిని చూసి మహిళలంతా అసూయ పడతారని చెప్పడం అప్పట్లో సంచలనంగా మారింది.