ఏనుగులు పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని మరణించాయనే వార్తలు మనం ఎన్నో చూసి ఉంటాం. అయితే అందులో మనం ఎవ్వరినీ తప్పుపట్టలేం. రైలు వేగంగా వెళ్లే క్రమంలో అలాంటి ప్రమాదాలు జరుగుతుంటాయి. కానీ, ఈ వీడియోలో మాత్రం రైలు డ్రైవరు ఏనుగు పట్టాలు దాటుతున్న దృష్యాన్ని చూసి రైలు ఆపేశాడు. ఏనుగు పట్టాలు దాటిన తర్వాతే రైలును పోనిచ్చాడు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జరిగింది.
గుల్మా – సివోక్ స్టేషన్ల మధ్య నడిచే ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ శుక్రవారం వెళ్తుండగా.. పట్టాలు దాటుతున్న ఏనుగు కనపడడంగో లోకో పైలట్లు కుమార్, కుందూలు సడెన్ బ్రేక్ వేసి రైలును ఆపివేశారు. ఏనుగు క్షేమంగా పట్టాలు దాటేదాకా వేచి చూసి ఆ తర్వాత ముందుకు కదిలారు. దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో చాలా మంది నెటిజన్లు లోకోపైలట్లను పొగుడుతూ కామెంట్లు చేస్తున్నారు.
#Alert LP & ALP of 15767 Up SGUJ-APDJ Intercity Exp Sri R.R. Kumar & S. Kundu suddenly noticed one Wild Elephant crossing the track at KM 23/1 between Gulma-Sivok at 17.35 hrs yesterday & applied brake to control Train speed saving Wildlife. @wti_org_india@RailMinIndia @RailNf pic.twitter.com/12PC5ffTqO
— DRM APDJ (@drm_apdj) May 12, 2022