రైలు ఢీకొని రెండు ముక్కలైన బస్సు.. ఇంకా నయం అలా జరగలేదు.. వీడియో
యూరోప్ దేశమైన నెదర్లాండ్స్‌లో షాకింగ్ ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన రైలు పట్టాలపై ఆగి ఉన్న బస్సును ఢీకొట్టింది. దాని ధాటికి బస్సు రెండు ముక్కలుగా విరిగిపోయింది. దీనికి సంబంధించిన వీడియో, సీసీ ఫుటేజ్ కంటికి చిక్కాయి. నూరబ్ బ్రాంబట్ పట్టణంలో రైల్వే క్రాసింగ్ గేటు వద్ద ఈ ఘటన జరిగింది.
ట్రాక్ దాటుతున్న బస్సు సరిగ్గా పట్టాలపైకి రాగానే ఇంజిన్ చెడిపోయి ఆగిపోయింది. డ్రైవరు మెకానిక్‌కి ఫోన్ చేసి అతని రాక కోసం ఎదురు చూస్తుండగా, ఇంతలో ట్రాక్ పైకి రైలు వచ్చింది. అయితే రైలు ఆపాలని బస్సు డ్రైవరు పదేపదే సూచించినా రైలు ఆగలేదు. దీంతో ప్రమాదం చోటు చేసుకుంది. అయితే బస్సులో ప్రయాణికులు ఎవ్వరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అటు రైలు కొంత దూరం వెళ్లి ఆగిపోయింది. ప్రమాద సమయంలో కూడా ఎవరికీ గాయాలు కాలేదు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్పందించి సహాయక చర్యలు ప్రారంభించారు. పట్టాలపై పడ్డ బస్సు శిథిలాలను తొలగించారు. ఘటనపై విచారణ జరుపుతున్నట్టు ప్రకటించారు.
Trein boort zich in bus. Geen gewonden. #bergenopzoom #ns pic.twitter.com/6JracwtPAp
— Ronald Groffen (@RonaldGroffen) October 17, 2022