దారిలో ఆగిన వలస తండ్రి గుండె.. ముగ్గురు కూతుళ్లు నడిరోడ్డుపై - MicTv.in - Telugu News
mictv telugu

దారిలో ఆగిన వలస తండ్రి గుండె.. ముగ్గురు కూతుళ్లు నడిరోడ్డుపై

May 18, 2020

valasa.....

కరోనా కరోనా నువ్వు ఎవరిని సాధిస్తున్నావూ? అని అడిగితే అది వలస కార్మికుల పేరు చెప్పినట్టుగానే ఉంది పరిస్థితి. ఓవైపు కరోనా సోకి చనిపోతుంటే మరోవైపు వలస

కార్మికులు మృత్యువాత పడుతున్నారు. లాక్‌డౌన్ కారణంగా వారి రెక్కలు విరిచేసినంత పనైంది. పోనీ సొంతూళ్లకు వెళదామంటే వెళ్లని పరిస్థితి? ఏం చేస్తామని.. నరనరాన శ్రమను ఇంకించుకున్న జీవులు వాళ్లు. కాలినడకన, సైకిళ్ల మీద వారు తమ స్వగ్రామాలకు బయలుదేరి మధ్యలో ప్రాణాలు పోగొట్టుకుంటున్న ఘటనలు గుండెలు పిండేస్తున్నాయి. మండుతున్న ఎండల్లో కరోనా వారి పాలిట శాపంగా మారింది. అలసి పోయి తీవ్ర అస్వస్థతకు గురై కొందరు, ప్రమాదాల్లో మరికొందరు మృతి చెందుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన వరుస ప్రమాదాల్లో ఏకంగా 35మంది కార్మికులు దుర్మరణం చెందడం అత్యంత విషాధం. 

తాజాగా మరో విషాధకరమైన దేశవ్యాప్తంగా ఎందరినో కంటతడి పెట్టిస్తోంది. మరో వలస కార్మికుడు ఇంటిక చేరుకోకుండానే ప్రాణాలు వదిలాడు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన వలసకార్మికుడు, బతుకుదెరువు కోసం గతంలో ముంబై నగరానికి వచ్చాడు. లాక్‌డౌన్‌తో అక్కడే చిక్కుకుపోయాడు. ఇక్కడ ఖాళీగా కడుపు కట్టుకుని ఎన్నాళ్లు ఉండాలని తన స్వస్థలమైన అజాంగఢ్‌కు వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాడు. తన ముగ్గురు కుమార్తెలను  వెంటబెట్టుకుని బయలుదేరాడు. ఈక్రమంలో ట్రక్కు దొరకడంతో తన ముగ్గురు కూతుళ్లతో కలిసి సదరు వలస కార్మికుడు సొంతూరుకు పయనమయ్యాడు. అయితే దురదృష్టవశాత్తు అతడు మార్గమధ్యలో ట్రక్కులోనే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై అయ్యో అనాల్సిన ఆ ట్రక్కు డ్రైవర్ మానవత్వం మరిచిపోయాడు. ఆ కార్మికుడి మృతదేహంతో పాటు అతని ముగ్గురు కూతుళ్లును రోడ్డు పక్కనే వదిలిపెట్టి వెళ్లిపోయాడు. మైనర్లు అయిన ఆ ముగ్గురు కూతుళ్లు తండ్రి శవం పక్కన కూర్చొని ఏడ్వటం పలువురుని కలిచివేసింది. ఆ ట్రక్కు డ్రైవర్‌ వారిని మధ్యప్రదేశ్‌‌లోని శివ్‌ పురి జిల్లాలోని కరేరా రోడ్డు పక్కనే వదిలిపెట్టివెళ్లాడని కరేరా తహసీల్దార్ గౌరీ శంకర్‌ బైర్వా వెల్లడించారు. తండ్రి మృతదేహంతోపాటు ఆ ముగ్గురు కూతుళ్లను స్వస్థలానికి పంపించేలా ఏర్పాట్లు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.