A two-year-old girl who belongs to Vijayawada was not infected with monkeypox
mictv telugu

ఆ చిన్నారికి మంకీపాక్స్‌ సోకలేదు.. ఊపిరి పీల్చుకున్న అధికారులు

July 17, 2022

విజయవాడలో చిన్నారికి మంకీపాక్స్‌ అనుమానిత లక్షణాలు ఉన్నట్లు ఇవాళ ఉదయం వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, బాలిక నమూనాలను పుణెలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపగా.. చిన్నారికి మంకీపాక్స్‌ సోకలేదని నిర్ధారణ అయ్యింది. ల్యాబ్‌లో చేసిన పరీక్షల్లో నెగిటివ్‌ వచ్చిందని ఆరోగ్యశాఖ కమిషనర్‌ వెల్లడించారు. బాలిక కుటుంబం ఇతరులతో కాంటాక్టు కాలేదని స్పష్టం చేశారు.

విజయవాడకు చెందిన రెండేళ్ల చిన్నారికి మంకీపాక్స్‌ లక్షణాలు కన్పించాయి. దీంతో చిన్నారి కటుంబాన్ని ఐసోలేషన్ లో ఉంచారు అధికారులు. ఇటీవలనే దుబాయ్ నుండి చిన్నారి కుటుంబం విజయవాడకు వచ్చింది. చిన్నారి ఒంటిపై దద్దుర్లు కావడంతో ఆసుపత్రికి తరలించారు. తాజాగా ఆ చిన్నారికి మంకీపాక్స్ సోకలేదని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

దేశంలోని కేరళ రాష్ట్రంలో తొలి మంకీ పాక్స్ కేసు నమోదైంది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఇటీవలనే పలు రాష్ట్రాలను అలెర్ట్ చేసింది.జ్వరం, దగ్గు, శరీరంపై దద్దుర్లు రావడం ఈ వ్యాధి లక్షణాలుగా చెబుతున్నారు. మంకీపాక్స్ సోకిన వారి నుండి ఇతరులకు కూడా ఈ వ్యాధి వ్యాప్తి చెందనుంది. మంకీపాక్స్ వ్యాధి సోకిన వారిని ఎవరెవరు కలిశారనే విషయాలపై కూడా వైద్య ఆరోగ్య శాఖాధికారులు వివరాలు సేకరించనున్నారు.