A vehicle carrying the jawans fell into the shok river valley in laddakh
mictv telugu

లడఖ్‌లో లోయలో పడ్డ బస్సు.. ఏడుగురు జవాన్ల మృత్యువాత

May 27, 2022

A vehicle carrying the jawans fell into the shok river valley in laddakh

జమ్ము కశ్మీర్‌లోని లడఖ్‌లో విషాదం చోటుచేసుకుంది. 26 మంది జవాన్లతో ప్రయాణిస్తున్న వాహనం ప్రమాద వశాత్తు షోక్ నది లోయలో పడిపోవడంతో ఏడుగురు చనిపోయారు. మిగతా వారు గాయల పాలయ్యారు. టుర్టుక్ సెక్టార్‌లో శుక్రవారం ఈ ప్రమాదం సంభవించింది.

సుమారు 60 అడుగుల లోతు గల లోయలో బస్సు పడిపోవడంతో మరణాలు సంభవించినట్టు తెలుస్తోంది. మరణించిన సైనికుల మృత దేహాలను వెలికి తీస్తున్నామని, గాయపడిన వారిని వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తరలిస్తున్నామని ఆర్మీ వర్గాల వెల్లడించాయి. కాగా మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.